స్పెషల్‌ ఒలింపిక్స్‌లో భారత ఖ్యాతి

స్పెషల్‌ ఒలింపిక్స్‌లో భారత ఖ్యాతి
స్పెషల్‌ ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారతీయులు ఎందరు అన్న ప్రశ్నకు సమాధానమే అథ్లెట్‌ గజేంద్ర. స్పెషల్‌ ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పాల్గొన్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గజేంద్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిస్తే ఔరా అనిపించాల్సిందే.

ఒలింపిక్స్‌... ప్రతీ అథ్లెట్‌ కల. అందులో పాల్గొనాలని... ఒక పతకమైన సాధించి ఒలింపిక్స్‌లో భారత్ సత్తావిశ్వ క్రీడా వేదికపై తన దేశ ఖ్యాతిని చాటాలని... ప్రతీ క్రీడాకారులు కల కంటాడు. అలా తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు దివ్యాంగులకు సైతం పారా ఒలింపిక్స్‌ ఉన్నాయి. మరి మానసిక వికలాంగుల పరిస్థితి ఏంటి అన్న వారి కోసమే ప్రత్యేకంగా స్పెషల్‌ ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహిస్తున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జూన్ 19 నుంచి ఈ ప్రత్యేక ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది స్పెషల్ ఒలింపిక్స్‌ క్రీడల్లో 26 విభాగాలు ఉండగా... అందులో 190 దేశాల నుంచి 7 వేల ప్రత్యేక అథ్లెట్లు....... పోటీ పడుతున్నారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అథ్లెట్‌ గజేంద్ర గురించి. స్పెషల్‌ ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పాల్గొన్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గజేంద్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిస్తే ఔరా అనిపిస్తుంది.

ప్రపంచంలోని పిల్లలందరూ సంతోషంగా ఉండాలన్న నినాదంతో ప్రత్యేక ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహిస్తున్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో భారత్‌ తరపున పాల్గొన్న తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన గజేంద్ర.. బీహార్‌లోని జహనాబాద్‌లో ఆర్మీ కుటుంబంలో జన్మించాడు. మానసిక వైకల్యంతో పుట్టిన గజేంద్రను చూసుకునేందుకు తండ్రి ఆర్మీ ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. గజేంద్ర చదివేందుకు అవసరమైన పాఠశాలలు లేకపోవడంతో పాట్నాలోని సమర్పన్ స్పెషల్ స్కూల్లో అతడిని చేర్చారు. అక్కడే గజేంద్ర జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఈ పాఠశాలకు స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ప్రోగ్రామ్‌తో ప్రత్యేక ఒప్పందం ఉంది. 2010లో ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీ పారా జిమ్నాస్ట్ సందీప్... గజేంద్ర చేరిన స్కూల్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. గజేంద్ర ప్రత్యేక శరీరాకృతిని గుర్తించిన సందీప్‌... అతడికి షాట్‌పుట్‌, రన్నింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

గజేంద్రకు చాలా సిగ్గు. చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఈ ప్రతిబంధకాన్ని తొలగించేందుకు సందీప్‌ అతడిని మాట్లాడించేవారు. అలా అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. షాట్‌పుట్‌, రన్నింగ్‌లో తనకే సాధ్యమైన ప్రతిభతో రాణించాడు. అలా స్పెషల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి బెర్లిన్‌ చేరాడు. అక్కడ ఒలింపియాపార్క్‌లోని హాన్స్-బ్రాన్-స్టేడియన్‌లో ట్రాక్ అడ్‌ ఫీల్డ్ ఈవెంట్‌లలో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడయ్యాడు. క్రీడలు తన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు... తనపై తనకు నమ్మకం పెరిగేందుకు దోహదం చేసిందని గజేంద్ర చెబుతున్నాడు..

Tags

Read MoreRead Less
Next Story