CWC 2023: ఆస్ట్రేలియా తుపానులో నెదర్లాండ్స్ గల్లంతు

CWC 2023: ఆస్ట్రేలియా తుపానులో నెదర్లాండ్స్ గల్లంతు
ప్రపంచకప్‌లోనే భారీ విజయం... మెరిసిన మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌

ప్రపంచకప్‌ చరిత్రలోనే ఆస్ట్రేలియా భారీ విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ను కంగారూల జట్టు.. 309 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ప్రపంచకప్‌ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. తొలుత టాస్‌ గెలిచిన ఆసిస్‌ మ్యాక్స్‌ వెల్‌, వార్నర్‌ల శతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో 309 పరుగుల భారీ తేడాతో కంగారులు ఘన విజయం సాధించారు. ఆసిస్‌ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 104 పరుగులు చేసి వరుసగా రెండో శతకం బాదాడు. స్టీవ్‌ స్మిత్ 71, లబుషేన్ 71 పరుగులతో రాణించారు. చివర్లో మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది 106 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే విధ్వంసకర శతకం చేసి ప్రపంచ కప్‌ చరిత్రలో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. డచ్‌ బౌలర్లలో వాన్‌ బీక్ 4 వికెట్లు తీశాడు.


400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్‌ జట్టు.. 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్‌ జంపా మరోసారి నాలుగు వికెట్లతో నెదర్సాండ్స్‌ పతనాన్ని శాసించాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు ఆరుగురు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన డచ్‌ జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆడమ్‌ జంపా మరోసారి నాలుగు వికెట్లతో నెదర్సాండ్స్‌ పతనాన్ని శాసించాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు ఆరుగురు... కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. డచ్‌ బ్యాటర్లలో అత్యధిక స్కోరు 25 పరుగులే కావడం గమనార్హం. విక్రమ్‌జిత్‌ సింగ్‌ తప్ప మరే బ్యాట్స్‌మెన్‌ కనీసం 15 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీంతో కేవలం 21 ఓవర్లలో 90 పరుగులకే నెదర్లాండ్స్‌ పని అయిపోయింది,.


గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్‌ వెల్‌ 106 పరుగులు చేశాడు. గ్లెన్‌ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్‌ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ బాయ్‌... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story