Ashes Test: పాపం ఇంగ్లాండ్, వరణుడే విలన్

Ashes Test: పాపం ఇంగ్లాండ్, వరణుడే విలన్

Ashes Series Eng vs Aus 5th Day: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు యాషెస్ సిరీస్‌ ఆశలను వరణుడు అడియాశలు చేశాడు. 4వ టెస్టులో గెలిచి తప్పక నిలుస్తామన్న ధీమాతో ఉన్న బెన్‌స్టోక్స్‌ సేనను వర్షం అడ్డుకుంది. 4వ రోజు 30 ఓవర్లే సాగిన ఆట, 5వ రోజు మొత్తానికే వర్షార్పణం కావడంతో ఇంగ్లాండ్ జట్టు నిరాశలో ఉంది.

మొదటి రెండు టెస్టులు ఓడినా, 3వ టెస్టులో అద్భుతంగా పుంజుకున్న ఇంగ్లాండ్, 4వ టెస్టులోనూ గెలవాలన్న కసితో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆడారు. 4వ రోజును 214 పరుగులకు 5 వికెట్లు తీసి, 5వ రోజు త్వరగానే వికెట్లు తీయాలకున్నా అది సాధ్యం కాలేదు. ఓపెనర్ క్రాలే, బెయిర్‌స్టోల విజృంభణతో భారీ ఆధిక్యంతో గెలుపుపై కన్నేసింది. కానీ ఇప్పుడు వారి ఆట వృథా ప్రయాసగానే మిగిలిపోయింది.


ఈ టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచి ఉంటే నిర్ణయాత్మక 5వ టెస్ట్ రసవత్తరంగా మారి ఉండేది. 5వ టెస్టులో ఆస్ట్రేలియా ఓడినా, మొదటి రెండు టెస్టుల్లో గెలిచి 2-1 ఆధిక్యంలో ఉండటంతో యాషెస్ ట్రోఫీని తన వద్దే నిలబెట్టుకోనుంది. 5వ టెస్ట్ ఈనెల 27న ఓవల్‌లో మొదలవనుంది.

Tags

Read MoreRead Less
Next Story