FIFA WORLDCUP: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌

FIFA WORLDCUP: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌
ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌... తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన బ్రిటీష్‌ జట్టు... ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు...

ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌(Women’s World Cup 2023 )లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. రెండో సెమీఫైనల్లో(FIFA Women’s World Cup 2023 Semifinal ) 3–1 గోల్స్‌ తేడాతో ఆతిథ్య ఆ్రస్టేలియా(Australia Women vs England Women)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో కలిసి ఈ ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా.. సంచలన ప్రదర్శనతో తొలిసారి సెమీస్‌ చేరినా కీలక పోరులో అంచనాలు అందుకోలేక చతికిలపడింది. మ్యాచ్‌ ఆద్యంతం ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో ప్రయత్నంలో తొలిసారి ఫైనల్‌ బెర్త్‌(ENG reach first WC final)ను దక్కించుకుంది. 2015, 2019 టోర్నీల్లో ఇంగ్లాండ్‌ జట్టు సెమీఫైనల్లో పరాజయం పాలైంది.


ఇంగ్లండ్‌ తరఫున 36వ నిమిషంలో ఎల్లా టూన్‌ , 71వ నిమిషంలో లౌరెన్‌ హెంప్‌ 94వ నిమిషంలో అలెసియా రుసో ఒక్కో గోల్‌ చేశారు. ఆస్ట్రేలియా జట్టులో 63వ నిమిషంలో సామ్‌ కెర్‌ ఏకైక గోల్‌ను అందించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 75 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇరు జట్లూ తొలి నిమిషం నుంచి అటాకింగ్‌ గేమ్‌ ఆడాయి. సెకండాఫ్‌లో స్కోరు సమానికి ఆసీస్‌ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వచ్చిన సువర్ణా అవకాశాలను చేజార్చుకున్న కంగారు జట్టు... తగిన మూల్యం చెల్లించుకుంది. శనివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో స్వీడన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.


మరోవైపు ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్‌ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌ 1–0తో స్వీడన్‌ జట్టును ఓడించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ టోర్నీ జరగ్గా నాలుగుసార్లు అమెరికా (1991, 1999, 2015, 2019)... రెండుసార్లు జర్మనీ (2003, 2007), ఒక్కోసారి నార్వే (1995), జపాన్‌ (2011) జట్లు టైటిల్‌ సాధించాయి. ఈసారి ప్రపంచకప్‌లో ఇప్పటికే స్వీడన్‌, ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరాయి. అంటే ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌ రానుంది.




Tags

Read MoreRead Less
Next Story