క్రీడలు

Babar Azam Father : భారత్ పై పాక్ విజయం.. బాబర్‌ తండ్రి ఎమోషనల్...!

Babar Azam Father : టీ20 వరల్డ్‌‌కప్‌‌లో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్‌‌లో టీంఇండియా పైన పాక్ జట్టు విజయం సాధించింది.. ఈ మ్యాచ్‌‌లో పాక్ ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Babar Azam Father : భారత్ పై  పాక్ విజయం.. బాబర్‌ తండ్రి ఎమోషనల్...!
X

Babar Azam Father : టీ20 వరల్డ్‌‌కప్‌‌లో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్‌‌లో టీంఇండియా పైన పాక్ జట్టు విజయం సాధించింది.. ఈ మ్యాచ్‌‌లో పాక్ ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో ఆ దేశంలోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తండ్రి అజామ్‌ సిద్దిఖి ఎమోషనల్ అయ్యారు.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ లో పాక్ పైన ఓటమి లేని భారత్‌‌ను ఓడించిన తొలి కెప్టెన్ గా బాబర్‌ అజామ్‌ నిలవడంతో ఆయన తీవ్ర భాగోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.కాగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణిత 20 ఓవర్లలలో ఏడువికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన పాక్‌ 17.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.


Next Story

RELATED STORIES