Cricket: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఉండరు.. ఇకపై...

Cricket: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఉండరు.. ఇకపై...
Cricket: మారుతున్న మనుషులతో పాటు చాలావరకు పాత పద్ధతులు కూడా మారాయి. స్త్రీ, పురుష భేదాలు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి.

Cricket: మారుతున్న మనుషులతో పాటు చాలావరకు పాత పద్ధతులు కూడా మారాయి. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భేదాలు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఇరువురికి సమాన అవకాశాలు అందుతున్నాయి. దాన్ని సరిసమానంగా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ కాలంలో స్త్రీ లేని రంగం అంటూ ఏదీ లేదు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే క్రికెట్‌లో కూడా. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేవారిని బ్యాట్స్‌మ్యాన్ అంటాం. కానీ అదే ఒక లేడీ క్రికెటర్‌ను పిలవలాంటే అలాంటి పేరేమి లేదు. బ్యాట్స్‌మ్యాన్ అనేది కేవలం మేల్ క్రికెటర్స్‌కు మాత్రమే వర్తించే పదం లాగా ఉందని లండన్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ భావించిందట. అందుకే బ్యాట్స్‌మ్యాన్‌కు బదులుగా బ్యాటర్ అని పిలిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది.

బ్యాటర్ అంటే మేల్ క్రికెటర్, ఫీమేల్ క్రికెటర్ ఇద్దరికీ వర్తిస్తుందని ఐసీసీ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఇచ్చిన సలహాను అంగీకరించింది. ఇకపై ఎవరినైనా బ్యాటర్ అని పిలవడం అలవాటు చేసుకుంటే ఫీమేల్ క్రికెటర్స్‌కు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని భావిస్తున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story