India-Bangladesh: భారత జట్టు ప్రకటన

India-Bangladesh: భారత జట్టు ప్రకటన

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న వన్డే, టీ20 భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జులై 9 నుంచి ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య ఈ సిరీస్‌ ప్రారంభమవనుంది. వన్డేలు, టీ20లకు భారత సీనియర్ క్రీడాకారిణి హర్మన్‌ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మొదటి T20 మ్యాచ్‌ షేర్-ఏ-బంగ్లా స్టేడియం, మీర్పూర్‌లో జరగనుంది.

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనుషా బారెడ్డి, రాశి కనోజియాలకు జట్టులోకి మొదటిసారి పిలుపు వచ్చింది. WPL లో ముంబయి ఇండియన్స్ తరపున ఆడిన యాస్తికా భాటియా వికెట్‌ కీపర్‌గా ఎంపికైంది. అస్సాంకి చెందిన ఉమా ఛెత్రీ 2వ వికెట్ కీపర్‌గా రెండు జట్లలో స్థానం సంపాదించుకుంది. కేరళకి చెందిన ఆల్‌రౌండర్ మిన్ను మానికి T20 జట్టులో స్థానం కల్పించారు. బ్యాట్స్‌మెన్ మేఘనా, ఫాస్ట్‌బౌలర్ మేఘనా సింగ్‌లకు కూడా పిలుపు వచ్చింది.

పలు మ్యాచులు ఆడిన లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ జట్టులో స్థానం కోల్పోయింది. వికెట్‌ కీపర్ రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌లు కూడా జట్టులో స్థానం కోల్పోయారు.

భారత జట్టు ఇంఛార్జి కోచ్‌గా హ్రిషికేష్ కనిత్కర్ వ్యవహరించనున్నాడు. రమేష్ పొవార్‌ను ఇంతకు ముందు కోచ్‌ పదవిని తొలగించిన తర్వాత భారత జట్టుకు రెగ్యులర్ కోచ్‌ని నియమించలేదు.

రెండు జట్లలోని క్రీడాకారులు బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీ లో ఇంతకుముందే క్యాంపుకు హాజరయ్యారు.


భారత T20I జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (WK), హర్లీన్ డియోల్, దేవిక అవేద, ఉమా చెత్రీ (wk), అమంజోత్ కౌర్, S. మేఘన, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, అంజలి సర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి.

భారత వన్డే జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికె), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా చెత్రీ (వికె), అమంజోత్ కౌర్, ప్రియా పునియా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్ , అంజలి సర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, స్నేహ రానా.

షెడ్యూల్ ఇదే..

1st T20I: July 9

2nd T20I: July 11

3rd T20I: July 13

1st ODI: July 16

2nd ODI: July 19

3rd ODI: July 22


Tags

Read MoreRead Less
Next Story