క్రీడలు

కృనాల్‌ పాండ్యకు కరోనా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Krunal Pandya: శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులోని కీలక ఆటగాడు కృనాల్‌ పాండ్యకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి.

కృనాల్‌ పాండ్యకు కరోనా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
X

Krunal Pandya: శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులోని కీలక ఆటగాడు కృనాల్‌ పాండ్యకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. కృనాల్‌ పాండ్య కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్‌ బయటకు వచ్చాయి. రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరిగింది. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టీ20 సిరీస్ మొదలైంది. తొలి టీ20 తర్వాత కృనాల్‌ పాండ్యకు కరోనా సోకింది. దాంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8 మంది ఆటగాళ్లను ఐసోలేషన్‌కు పంపించడంతో జట్టు గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. రెండు మూడు టీ20ల్లో శ్రీలంక విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.

కృనాల్‌ పాండ్య గొంతునొప్పి వస్తోందని చెప్పినా.. బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్‌ టెస్టు చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అనుమతి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పర్యటనతో సంబంధం ఉన్న బీసీసీఐ వర్గాలు ఈ విషయం ధ్రువీకరిస్తున్నాయి. జులై 26న కృనాల్‌ గొంతు నొప్పి వచ్చిన విషయం డా. అభిజిత్‌ సల్వీకి చెప్పాడు. రూల్స్ ప్రకారం ఆరోజు అతడికి ర్యాపిడ్‌ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు.

ఇక 27న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించాడు. ఫలితాలు మధ్యాహ్నం రావడంతో మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్‌ఎల్‌సీ ప్రకటించాయి. మిగతా 8 మందికీ పరీక్షలు చేశారు. జట్టంతా నెగెటివ్‌ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్‌, యుజ్వేంద్ర చాహల్‌కు పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ కావడంతో కృనాల్‌, గౌతమ్‌, యూజీ టీమ్‌ఇండియాతో కలిసి స్వదేశానికి రాలేదు. ఆగస్టు ఆరంభంలో వారు ఇళ్లకు చేరుకున్నారు.

'జులై 26న కృనాల్‌కు గొంతునొప్పి వచ్చింది. గొంతు నొప్పి ఉన్నప్పటికీ కృనాల్‌ జట్టు సమావేశానికి హాజరయ్యాడని నేను చెప్పగలను అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఓ ఇంగ్లాష్ వెబ్ సైట్ పేర్కొంది. ఐపీఎల్‌లో ప్రతి 3 రోజులకు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తుంటే శ్రీలంక సిరీసులో 5 రోజులకు చేసేందుకు బీసీసీఐ వైద్యబృందం ఎలా అంగీకరించిందో తెలియడం లేదు. శ్రీలంతో సిరీస్ జరగడంతో వారికి మంచి జరిగి ఉండొచ్చు. టీమిండియా భారీ ముల్యమే చెల్లించింది. పూర్తి స్థాయి జట్టు లేకపోవడంతో శ్రీలంక సూనాయాసంగా సిరీస్ గెలిచింది.

Next Story

RELATED STORIES