క్రీడలు

Bhuvneshwar Kumar : తండ్రైన టీంఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ..!

Bhuvneshwar Kumar: టీంఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మొదటిసారి తండ్రయ్యాడు. ఆయన భార్య నుపుర్‌ నగర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Bhuvneshwar Kumar : తండ్రైన టీంఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ..!
X

Bhuvneshwar Kumar: టీంఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మొదటిసారి తండ్రయ్యాడు. ఆయన భార్య నుపుర్‌ నగర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భువనేశ్వర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వారి నాలుగో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న మరుసటి రోజే భువీ- నుపుర్‌ దంపతులు తల్లిదండ్రులు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాగా భువనేశ్వర్‌- నుపుర్‌ నగర్‌ 2017లో నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో జరిగింది. ఇక క్రికెట్ లోకి 2012లో ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ అతికొద్ది సమయంలోనే జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 119 వన్డేలు, 55 టీ20లు, 21 టెస్టులు ఆడాడు. విశేషం

Next Story

RELATED STORIES