Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ..

Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ..
జస్ ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (vc), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (wk), జితేష్ శర్మ (wk), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

భారత స్పెషలిస్ట్ బౌలర్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. వెన్నెముక గాయంతో సర్జరీ చేయించుకున్న బుమ్రా చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి ఫిట్‌నెస్‌పై నమ్మకముంచిన జట్టు యాజమాన్యం బుమ్రాని జట్టులోకి ఎంపిక చేసింది. అది కూడా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆగస్ట్ నెలలో ఐర్లాండ్‌ జట్టుతో జరగనున్న 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ క్రిష్ణ, మరో బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌లు కూడా భారత జట్టులోకి వచ్చాడు. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, గిల్‌లకు విశ్రాంతినిచ్చారు.


ఆగస్ట్ 18 నుంచి 23 వరకు 3 టీ20లు డబ్లిన్‌లో జరగనున్నాయి. ఈ సిరీస్‌ ముగిసిన వారం తర్వాత మళ్లీ భారత జట్టు ఆగస్ట్ 30 నుంచి ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఐర్లాండ్ సిరీస్‌కి ఎంపికైన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఆసియా క్రీడల్లోనూ ఆడనున్నారు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు.

2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 చివరి మ్యాచ్ ఆడిన బుమ్రా అప్పటి నుంచి భారత జట్టు తరపున మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం ఎక్కువవడంతో మార్చి నెలలో సర్జరీ చేయించుకుని, కోలుకున్న అనంతరం NCA లో సాధన మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించి ఇపుడు ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బుమ్రా గత సంవత్సరం ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హాం టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు.

షెడ్యూల్..

1st టీ20- ఆగస్ట్ 18- 7.30 PM

2nd టీ20- ఆగస్ట్ 20- 7.30 PM

3rd టీ20- ఆగస్ట్ 23- 7.30 PM

భారత జట్టు ఇదే..

జస్ ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (vc), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (wk), జితేష్ శర్మ (wk), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్



Tags

Read MoreRead Less
Next Story