DC vs GT : గుజరాత్‌పై ఢిల్లీ ఘన విజయం

DC vs GT :  గుజరాత్‌పై  ఢిల్లీ ఘన విజయం
సొంతగడ్డపై గుజరాత్ కు ఘోర పరాభవం

శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ కు సొంతగడ్డపై 6 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదురైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో గుజరాత్‌ ఘోర ఓటమి చవిచూసింది. ముందుగా… టాస్ గెలిచిన కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోగా… ఢిల్లీ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చూస్తే… లోయర్ ఆర్డర్ లో రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే అత్యధికం.

అయితే.. అనంతరం, 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 4 వికెట్లు చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 పరుగులు చేయగా… అభిషేక్ పోరెల్ 15 (7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షాయ్ హోప్ 19 (1 ఫోర్, 2 సిక్సులు), కెప్టెన్ రిషబ్ పంత్ 16 (1 ఫోర్, 1 సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

కోల్‌కతాతో మ్యాచ్‌లో 272 పరుగులు సమర్పించుకుని వందకు పైగా తేడాతో ఓడిన నేపథ్యంలో నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ దిల్లీ.. దాన్ని సరిచేసుకోవడానికి ఈ మ్యాచ్‌ను బాగానే ఉపయోగించుకుంది. ఛేదనలో ఓవైపు వికెట్లు పడుతున్నా ఆ జట్టు దూకుడు తగ్గించలేదు. తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో (లఖ్‌నవూపై) మెరుపు అర్ధశతకంతో జట్టును గెలిపించిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌.. గుజరాత్‌తో పోరులోనూ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.

Tags

Read MoreRead Less
Next Story