Dhoni: తమిళ నటుడికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన ధోనీ

Dhoni: తమిళ నటుడికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో తానూ ఒక నిర్మాతగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు యోగి బాబు, నదియాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న LMG(Lets Get Married) అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్, ఆడియోని జులై 10న సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ధోనీ, సాక్షిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మ్యాచ్ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో తన చమత్కారాలతో విలేఖర్లకు సమాధానం చెప్పి అలరించే ధోనీ, ఈ కార్యక్రమంలో నటుడు యోగి బాబు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబు అక్కడ ఉన్న వారిని నవ్వులు పూయించింది.

తనకి CSK టీంలో చోటు కల్పించాలని ధోనిని కోరాడు. దానికి ధోనిని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

"మా జట్టు ఆటగాడు అంబటి రాయుడు రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి నీకు జట్టులో చోటు ఉంటుంది. నేను సీఎస్‌కే యాజమాన్యంతో మాట్లాడతాను. కానీ నువ్వు సినిమాల్లో బిజీగా ఉంటావు కదా. అక్కడ బౌలర్లు చాలా వేగంగా బౌలింగ్ వేస్తారు. నిన్ను గాయపరచాలనే ఉద్దేశ్యంతోనే వాళ్లు బౌలింగ్ వేస్తుంటారు. జట్టులో వచ్చిన తర్వాత నిలకడగా ఆడాలి" అని తనదైన శైలిలో సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగారు.


గత సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, రాంఛీలో పుట్టి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. IPLతో తమిళనాడుతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకున్నాడు. తమిళ ప్రజలు తలా అని పేరు పెట్టుకుని పిలుస్తారు. ధోనీ నేతృత్వంలోని CSK జట్టు 5 సార్లు కప్ గెలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన విశేషాలు పంచుకుంటూనే ఉంటాడు. ఇటీవలె తన పెంపుడు కుక్కల బర్త్ డే కోసం కేక్ కట్ చేయించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story