Dhoni : గౌరవం రాదు.. సంపాదించుకోవాలి.. ధోనీ క్లాసిక్ వర్డ్స్

Dhoni : గౌరవం రాదు.. సంపాదించుకోవాలి.. ధోనీ క్లాసిక్ వర్డ్స్

క్రికెట్ ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ మంచి మాట చెప్పాడు. ముంబైలో ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ధోనీ.. గౌరవం ఎవరో ఇస్తే రాదనీ.. సొంతంగా సంపాదించుకోవాలని చెప్పారు. ధోనీ మాటలు వైరల్ అవుతున్నాయి.

మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని ధోనీ చెప్పారు. మన పట్ల వ్యక్తుల్లో విధేయత అనేది.. మనం ఇచ్చే గౌరవం ద్వారానే తిరిగి వస్తుందని చెప్పారు. కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని.. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని చెప్పి మరోసారి వైరల్ అయ్యారు.

'మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని నేను భావించను. మనం ఎలా వ్యవహరిస్తామన్నదాన్ని బట్టే అది దక్కుతుంది. గౌరవం దానంతట అది రాదు. మనం సంపాదించుకోవాలి. మనల్ని సహచరులు నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుంది' అని ధోని చెప్పారు. డ్రెస్సింగ్‌ రూంలో తోటి ప్లేయర్లు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరనీ.. మనం చెప్పే మాటలను చేతల్లోనూ చూపించాల్సి ఉంటుందని అన్నారు. మన ప్రవర్తనే మనకు గౌరవం తెచ్చిపెడుతుందని మంచి మాట చెప్పారు ధోనీ.

Tags

Read MoreRead Less
Next Story