ECB: ఇక పురుషులతో సమానంగా మ్యాచ్‌ ఫీజ్‌

ECB: ఇక పురుషులతో సమానంగా మ్యాచ్‌ ఫీజ్‌
ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం... పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో శుభవార్త చెప్పిన ఈసీబీ...

పురుష క్రికెటర్లతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను(equal match fee) చెల్లించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా(India, New Zealand and South Africa) క్రికెట్‌ బోర్డులు పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లాండ్(England) చేరింది. ఇటీవల ముగిసిన మహిళల మల్టీ ఫార్మాట్‌ యాషెస్ సిరీస్‌(successful Women's Ashes)కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. రికార్డు స్థాయిలో జనాలు స్టేడియాలకు పోటెత్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 1,10,000 మంది ప్రేక్షకులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్, కియా ఓవల్, లార్డ్స్ మైదానాలలో కూడా ఆస్ట్రేలియాలతో జరిగిన మ్యాచ్‌లకు ప్రేక్షకులు రికార్డు స్థాయిలో హాజరయ్యారు. దీంతో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు పెంచుతామని ఈసీబీ (ECB) ప్రకటించింది.


పెరిగిన ఈ వేతనాలు ఈ వారంలో శ్రీలంకతో జరబోయే సిరీస్ నుంచే అమలులోకి రానున్నాయి. ఇది మహిళల క్రికెట్ చరిత్రలో అత్యుత్తమమైనదని ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్(Heather Knight) ప్రకటించింది. మ‌హిళా క్రికెట‌ర్ల మ్యాచ్ ఫీజు పెంపు నిర్ణయం ఓ పెద్ద ముంద‌డుగుగా అభివర్ణించింది. ECB నిర్ణయంతో దేశంలోని అమ్మాయిలకు క్రికెట్ మ‌రింత ద‌గ్గర అవుతుందనే న‌మ్మకం వ్యక్తం చేసింది. తెలిపింది.


మహిళా క్రికెటర్లకు ఆదరణ పెరగడాన్ని ఈసీబీ గమనించింది. దీంతో తమ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను ఒకసారిగా పెంచేసింది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు కూడా మ్యాచ్ ఫీజులు చెల్లించాలని ఈసీబీ నిర్ణయించింది. త్వరలో శ్రీ‌లంక వ‌న్డే సిరీస్‌తో పెరిగిన మ్యాచ్ ఫీజు వ‌ర్తించ‌నున్నట్టు ఈసీబీ ఓ ప్రక‌ట‌న‌లో వెల్లడించింది.

ఇంగ్లండ్ గ‌డ్డపై ఈమ‌ధ్యే మ‌హిళ‌ల‌ యాషెస్ టెస్టు జ‌రిగింది. ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. పురుషుల యాషెస్‌ను త‌ల‌ద‌న్నేలా స్టేడియం కిక్కిరిసి పోయింది. ఈ మ్యాచ్‌లో ప‌ర్యాట‌క ఆస్ట్రేలియా 89 ప‌రుగుల‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ‌ర్ అష్ గార్డ్‌న‌ర్ ఏకంగా 12 వికెట్లతో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టింది. గార్డ్‌న‌ర్ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీయ‌డంతో ఆతిథ్య జ‌ట్టు ఓట‌మి పాలైంది.

Tags

Read MoreRead Less
Next Story