Ashes Test: రసవత్తరంగా 3వ టెస్ట్, ఇంగ్లాండ్ లక్ష్యం 251

Ashes Test: రసవత్తరంగా 3వ టెస్ట్, ఇంగ్లాండ్ లక్ష్యం 251

మూడవ యాషెస్ టెస్ట్‌ రసవత్తరంగా మారింది. సిరీస్‌లో వరుసగా రెండో సారి ఇంగ్లాండ్‌కి గెలిచే అవకాశకాలు వచ్చాయి. మొదటి టెస్ట్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపుగా ఛేదించినంతగా చేసిన ఇంగ్లాండ్ ఓడిన సంగతి తెలిసిందే. 3వ టెస్ట్‌లో ఆ జట్టు విజయానికి కేవలం 224 పరుగులు చేయాల్సి ఉంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు కోల్పోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్(18), క్రాలీ(9) ఉన్నారు. 3వ రోజు వర్షం అడ్డు పడకుంటే ఫలితం తేలేదే.

వర్షం అంతరాయం కలిగంచడంతో మోడో రోజు ఆట రెండు సెషన్లు పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. 4 వికెట్లకు 108 పరుగులతో 3వ రోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా. అప్పటికే ఆస్ట్రేలియా జట్టు 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. పిచ్‌ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ని బౌన్సర్లతో కుదురుకోనివ్వలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మిషెల్ మార్ష్‌ను(28), అలెక్స్‌ కారే(5)ను క్రిస్ వోక్స్‌ వెనువెంటనే. ఔట్‌ చేశాడు. స్కోర్ 200 అయినా దాటుతుందా అని అన్పించింది. తర్వాత గేర్లు మార్చిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్(112 బంతుల్లో 77, 7 ఫోర్లు, 3 సిక్సులు ) దూకుడుగా ఆడుతూ సిక్సులు, ఫోర్లతో స్కోర్‌బోర్డులో వేగం పెంచాడు. మర్ఫీ(11) బ్రాడ్ బౌలింగ్‌లో 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం 2 సిక్స్‌లు కొట్టిన దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔట్‌ అయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 10వ వికెట్‌గా వెనుదిరిగడంతె ఆస్ట్రేలియా 224 పరుగులకు ఆలౌట్ అయింది.మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 3/45, క్రిస్ వోక్స్ 3/68 తో రాణించారు.

251 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు క్రాలే, బెన్ డకెట్‌లు అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ వికెట్ పడకుండా ఆడారు. 5 ఓవర్లలో 27 పరుగులు చేసింది.




Tags

Read MoreRead Less
Next Story