FIFA women’s world cup: స్పెయిన్‌ అమ్మాయిలు... విశ్వ విజేతలు

FIFA women’s world cup: స్పెయిన్‌ అమ్మాయిలు... విశ్వ విజేతలు
ఫిఫా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం... హోరాహోరీగా తలపడ్డ ఇరు జట్లు.... తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా స్పెయిన్‌....

ఫిఫా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో(FIFA Women's World Cup Final) తొలిసారి ప్రవేశించిన స్పెయిన్‌(Spain).. అదే ఊపులో టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ చేరిన తొలిసారే ఫుట్‌బాల్‌ విశ్వ విజేతగా అవతరించి రికార్టు నెలకొల్పింది. ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఈ పోరులో ఇంగ్లాండ్‌ (England)- స్పెయిన్ జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా( clash between the teams) తలపడ్డాయి. తొలి అర్ధభాగంలో గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లిన స్పెయిన్‌... అదే ఆధిక్యాన్ని చివరి వరకూ కొనసాగించింది. చివరి వరకు అదే ఒత్తిడిని కొనసాగించిన స్పెయిన్‌ మహిళల జట్టు 1-0తో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి విశ్వ విజేతగా అవతరించింది.


మ్యాచ్‌ మొత్తంలో ఒకే ఒక్క గోల్‌ నమోదు కాగా స్పెయిన్‌ కు చెందిన స్ట్రయికర్‌ ఓల్గా కార్మోనా 29వ నిమిషంలో( first-half strike) బంతిని గోల్‌ పోస్ట్‌లోకి నెట్టి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఎంత ప్రయత్నించినా స్కోరు సమం చేయలేకపోయింది. ద్వితీయార్ధంలో స్పెయిన్‌ పటిష్ఠ డిఫెన్స్‌ను ఛేదించేందుకు ఇంగ్లాండ్‌ స్ట్రయికర్‌లు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గతేడాది యూరోపియన్‌ ఛాంపియన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన స్పెయిన్‌... ఈసారి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్‌ ఓల్గా క్యార్‌మోనా(Skipper Olga Carmona) సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్‌మోనాకు అంతర్జాతీయ కెరీర్‌లో తొలి గోల్‌ కావడం విశేషం.


ప్రపంచకప్‌ ప్రారంభం నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్‌ తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. పరాజయం ఎరగకుండా ఫైనల్‌ చేరిన బ్రిటీష్‌ జట్టు తుది పోరులో ఒత్తిడికి తలవంచింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కన్నీళ్లతో మైదానాన్ని వీడారు. తొలిసారి ఫైనల్‌ చేరిన ఇంగ్లాండ్‌ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.



Tags

Read MoreRead Less
Next Story