Rishabh Pant: పునరాగమనం దిశగా పంత్‌

Rishabh Pant: పునరాగమనం దిశగా పంత్‌
వేగంగా కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌.... అంతా బాగుందని వెల్లడి.. నెట్టింట వైరల్‌గా సైక్లింగ్‌ చేస్తున్న వీడియో....

గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నాడు. దాదాపు 8 నెలలుగా ఆటకు దూరమైన పంత్‌.. ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి వచ్చేందుకు శ్రమిస్తున్నాడు. మోకాలి శస్త్రచికిత్స(surgery) అనంతరం సొంతంగా బరువులు ఎత్తడం, స్టిక్‌ అవసరం లేకుండా నడవడం చేస్తున్న పంత్‌.. తాజాగా సైక్లింగ్ (cycling) చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియా(social media)లో పోస్ట్ చేశాడు.


ఇప్పుడు బాగున్నాని, ఎంతో బలంగా ఉన్నానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తానని పంత్‌ పోస్ట్‌(pant post) చేశాడు. వేగంగా కోలుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్న పంత్‌... శస్ర్త చికిత్స జరిగిన తర్వాత మోకాలిని వంచగలుగుతున్నానని... గుడ్ వైబ్స్‌’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంత్‌ (wicketkeeper-batter Rishabh Pant) కసరత్తులు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. తన రికవరీకి సంబంధించిన ఫొటోలతోపాటూ తన హెల్త్‌ అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంత్‌ షేర్‌ చేస్తూ వస్తున్నాడు.

రోడ్డు ప్రమాదం(road accident‌)లో గాయపడిన తర్వాత రిషబ్‌ పంత్‌ తొలిసారి భారత జట్టు(indian team) శిబిరానికి వచ్చి సహచరులను కలిశాడు. ఆసియాకప్‌(asia cup) కోసం సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లతో అతడు మాట్లాడాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(rahul dravid)తోనూ ముచ్చటించాడు. భారత 77వ‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ బ్యాటింగ్ చేశాడు. ప్రమాదం తర్వాత తొలిసారి బ్యాట్‌ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.


గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిషబ్ పంత్‌ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ టైంకి పంత్‌ ఫిట్‌గా ఉంటాడనే టాక్ వినిపిస్తుంది. పంత్‌(Rishabh Pant) వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయాని కంటే ముందే టీమిండియా‍(team india)లో జాయిన్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story