India vs Pakistan: పాక్‌ను చిత్తుచేసిన భారత్‌

India vs Pakistan: పాక్‌ను చిత్తుచేసిన భారత్‌
ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నీలో 4-0తో ఘన విజయం... టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్‌..

ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నీ(Asian Champions Trophy 2023 )లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్‌(India vs Pakistan) చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో దాయాదిని చిత్తు చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో సాధికారంగా విజయాలతో ఇప్పటికే సెమీస్‌ చేరిన టీమిండియా.. పాకిస్థాన్‌ను 4-0 తేడా(beating them 4-0 )తో చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఇంతవరకూ అపజయమెరుగని భారత్‌ పాక్‌పై ఘన విజయంతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించి(Pakistan are eliminated‌) స్వదేశానికి పయనమైంది.


పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సింగ్‌ సేన తొలినుంచే దూకుడు ప్రదర్శించింది. రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ ద్వారా భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. అదే దూకుడు కనబరుస్తూ మరో పది నిమిషాల్లోపే దక్కిన కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌( captain Harmanpreet) గోల్‌ చేయడంతో భారత్‌ ఆధిక్యం 2-0కు చేరుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌సింగ్‌(15, 23ని) డబుల్‌ గోల్స్‌తో భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. జుగ్‌రాజ్‌ సింగ్‌(36ని), ఆకాశ్‌దీప్‌సింగ్‌(55ని) ఒక్కో గోల్‌ నమోదు చేయడంతో పాక్‌ ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. భారత డిఫెన్స్‌ను ఛేదించలేక పోయిన పాక్‌ కనీసం ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. గోల్‌ కోసం పాక్‌ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ విజయంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక డ్రాతో భారత్‌ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 11న జరిగే సెమీస్‌లో జపాన్‌తో భారత్‌ తలపడుతుంది.


హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో హాకీ ఈవెంట్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్‌ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్‌లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది.

ఆసియా క్రీడల్లోనే ప్రతిష్ఠాత్మకంగా జరిగే భారత్‌-పాక్ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న జరుగుతుంది. టైటిల్‌ పోరు అక్టోబర్‌ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్‌ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్‌తో ఆడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story