IND vs PAK: సునీల్‌ ఛెత్రీ హ్యాట్రిక్‌.. భారత్ చేతిలో పాక్‌ చిత్తు

IND vs PAK: సునీల్‌ ఛెత్రీ హ్యాట్రిక్‌.. భారత్ చేతిలో పాక్‌ చిత్తు

అంతర్జాతీయ స్థాయిలో అత్యథిక గోల్స్‌ కొట్టిన జాబితాలో భారత ఫుట్‌బాల్ స్టార్‌ సునీల్ ఛెత్రి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 4వ స్థానానికి ఎదిగాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ చేసి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 4-0తో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.



సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్‌(SAFF)లో భాగంగా బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఆతిథ్య పాకిస్థాన్‌తో తలపడిన భారత్‌.. ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్‌ సాధించగా, ఉదంత్‌ సింగ్ కుమమ్ భారత్‌కు నాలుగో గోల్‌ను అందించాడు.

అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో(123) ఉన్నాడు. మాజీ ఇరాన్ స్ట్రైకర్ అలీ డేయి (109), అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ (103) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 90 గోల్స్‌తో సునీల్‌ ఛత్రీ నాలుగో స్థానంలో నిలిచాడు. 2005లో భారత జట్టు తరఫున ఆరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రీ, మొదటి గోల్ పాకిస్థాన్‌పైనే కొట్టడం విషేశం.





భారత్‌ గెలుపు పట్ల దేశవ్యాప్తంగా నెటిజన్లు హర్షిస్తున్నారు. సునీల్‌ ఛత్రీ సాధించిన ఘనతను ఫుట్‌బాల్ లవర్స్‌ అభినందించారు. ‌

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మొదటి నుంచి పైచేయి సాధించింది. ప్రత్యర్థి డిఫెండింగ్‌ ప్లేయర్లపై ఒత్తిడి పెంచి మనవాళ్లు సునాయాసంగా గోల్స్ కొట్టారు. ‌

టోర్నీలో భాగంగా జూన్‌ 24న భారత్‌ నేపాల్‌ జట్టుతో తలపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story