TEAM INDIA: అన్ని ఫార్మట్లలో మనమే నెంబర్‌ వన్‌

TEAM INDIA: అన్ని ఫార్మట్లలో మనమే నెంబర్‌ వన్‌
టీమిండియా నయా చరిత్ర... రోహిత్‌ సారథ్యంలో అరుదైన ఘనత

5 టెస్టుల సిరీస్ లో స్వదేశంలో ఇంగ్లాండ్ ను 4-1 తేడాతో చిత్తు చేసిన టీమిండియా I.C.C టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. I.C.C తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 122 పాయింట్లతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్...అగ్రస్థానంలో నిలిచింది. 117 పాయింట్లతో...ఆసీస్ రెండో స్థానంలో ఉండగా, 111 పాయింట్లతో...ఇంగ్లాండ్ మూడోస్థానంలో ఉంది. ఇప్పటికే వన్డే, T-20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్...తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ మెుదటిస్థానానికి చేరుకుంది. మూడు ఫార్మట్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలోనూ...68.51 శాతంతో భారత్ మెుదటిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లోనూ భారతే టాప్‌ ర్యాంక్‌లో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమ్‌ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు టెస్టు ర్యాంక్‌తో కలిపి నాలుగింట్లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది.

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లనూ భారత్ గెలుచుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖరారైనట్టే. కాగా, ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో 121 పాయింట్లతో టీమిండియా అగ్ర స్థానంలో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్‌లో నిలిచింది. అలాగే ప్రపంచ టీ-20 ర్యాకింగ్స్‌లో 266 రేటింగ్ పాయింట్లతో టీమిండియా తొలి స్థానంలో ఉంది. 256 పాయింట్లతో ఇంగ్లండ్ సెకెండ్ ప్లేస్‌లో ఉంది.

ధర్మశాల వేదికగా జరిగిన వందో టెస్ట్‌ను భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ చిరస్మరణీయం చేసుకున్నాడు. వందో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటాడు. చివరి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్‌.. అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. 35 సార్లు అయిదు వికెట్లు తీసి అనిల్‌ కుంబ్లే నెలకొల్పిన రికార్డును అశ్విన్‌ ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు. అత్యధిక సార్లు అయిదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 67 సార్లు ఈ ఘనత సాధించి శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ మురళీధరన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్‌ వార్న్‌ 37 సార్లు... అశ్విన్‌ 36 సార్లు ఈ ఘనత సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు.

Tags

Read MoreRead Less
Next Story