Jaydev Unadkat: ఇంగ్లండ్‌ కౌంటీలకు ఉనద్కత్‌

Jaydev Unadkat: ఇంగ్లండ్‌ కౌంటీలకు ఉనద్కత్‌
సస్సెక్స్‌ తరపున బరిలోకి దిగనున్న ఉనద్కత్‌.... రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు...

మరో టీమిండియా క్రికెటర్‌కు ఇంగ్లాండ్‌ కౌంటీల నుంచి ఆహ్వానం అందింది. ఈమ‌ధ్యే భార‌త జ‌ట్టుకు ఎంపికైన‌ జ‌య‌దేవ్ ఉనాద్కత్‌(Jaydev Unadkat) కౌంటీ(County)ల్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న టోర్నీలో అత‌ను స‌స్సెక్స్ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. సస్సెక్స్‌ జ‌ట్టు త‌ర‌ఫున ఆడనున్న రెండో భార‌త క్రికెట‌ర్‌గా ఉనాద్కత్‌ గుర్తింపు పొందాడు. ఇంత‌కుముందు టీమిండియా నయ‌వాల్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) స‌స్సెక్స్ జట్టు తరుపున ఆడాడు.


స‌స్సెక్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నాని, కొన్ని రోజులుగా ఆ జ‌ట్టు విజ‌య‌ప‌రంప‌ర‌ను గమ‌నిస్తున్నానని ఉనద్కత్‌ అన్నాడు. ఛాంపియ‌న్స్ లీగ్ పోటీల కోసం సెప్టెంబ‌ర్ నెల‌లో ఇంగ్లండ్ వెళ్తానని తెలిపాడు. ఉనద్కత్‌ ప‌దేళ్ల త‌ర్వాత ఇటీవలే తిరిగి టీమిండియాలో మ‌ళ్లీ చోటు దక్కించుకున్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో వికెట్ల వేట కొన‌సాగిస్తున్న అత‌ను ఈ మ‌ధ్యే ముగిసిన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. దేశ‌వాళీలో ఎడ‌మ చేతివాటం పేస‌ర్ 400 వికెట్ల మైలురాయికి చేరువ‌లో ఉన్నాడు. బంతితో రాణించ‌డ‌మే కాకుండా లోయ‌ర్ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు నైపుణ్యం ఇత‌డి సొంతం. ఈ ఏడాది అత‌డి కెప్టెన్సీలో సౌరాష్ట్ర రంజీ చాంపియ‌న్‌గా నిలిచింది. ఫైన‌ల్లో ముంబైపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది.

Tags

Read MoreRead Less
Next Story