Ind vs Eng 1st Test: జడేజా అరుదైన రికార్డ్.. దిగ్గజాల లిస్ట్‎లోకి..

Ind vs Eng 1st Test: జడేజా అరుదైన రికార్డ్.. దిగ్గజాల లిస్ట్‎లోకి..
India Vs England 1st Test: నాటింగ్ హోమ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ -టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు భారత్ పైచేయి సాధించింది.

Ravindra Jadeja: నాటింగ్ హోమ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ -టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు భారత్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 278 పరుగులకు ఆలౌట్ అయింది. 125/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో 3వ రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 84.5 ఓవర్లలో 278 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్(214 బంతుల్లో, 12 ఫోర్లతో, 84), రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లతో 56) రాణించారు. ఆరో వికెట్‌కు ఈ ఇద్దరు 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వికెట్ కీపర్ రిషభ్ పంత్(25 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్‌తో, 20 బంతుల్లో ) నిరాశపరిచాడు. ఆఖర్లో బూమ్రా (28పరుగులు, 34బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. దాంతో ఇంగ్లాండ్ పై భారత్‌కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా.. జేమ్స్ అండర్సన్ 4 నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 2,000 పరుగులు, రెండు వందల వికెట్లు తీసిన ఐదో భారత ఆల్‌రౌండర్‌గా ఘనత సాధించాడు. ఈ టెస్ట్‌లో హాఫ్ సెంచరీ బాదిన రవీంద్ర జడేజా(56 రన్స్) టెస్ట్ కెరీర్‌లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దాంతో దిగ్గజ ఆల్‌రౌండర్ల జాబితాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ 5,248 పరుగులు, 434 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(2685 రన్స్, 413 వికెట్లు), దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉన్నారు. వీరి సరసన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా చేరాడు. జడేజా 53 టెస్టుల్లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక టెస్టు క్రికెట్ లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న 5వ ఆల్‌రౌండర్‌గా జడేజా నిలిచాడు. మొదటి స్థానంలో ఇయాన్ బోథమ్, ఆ తర్వాత కపిల్‌దేవ్, ఇమ్రాన్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story