Team India: వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్...

Team India: వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్...
దీపావళి ధమాకా.. టాస్ గెలిచిన టీమిండియా

వన్డే ప్రపంచకప్ 2023 ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా లీగ్ దశలో ఆఖరి పోరుకు సిద్దమైంది. బెంగళూరు వేదికగా జరిగే మ్యాచులో నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఎంచుకుంది. టీమిండియా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు.. నెదర్లాండ్స్ జట్టు కూడా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది.ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అంత కీలకం కాదు. గెలిచినా ఓడినా జట్టుకు ఏం కాదు. నాకౌట్ పోరుకు ముందు ఈ మ్యాచ్ ఓ ప్రాక్టీస్ లాంటిది.

భారత గడ్డపై అక్టోబరు 5న ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో ఆతిథ్య టీమిండియా, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో తిరుగులేని రికార్డుతో బరిలో దిగుతోంది. నెదర్లాండ్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివర ఉంది. టీమిండియా ప్రస్తుతం ఉన్న భీకర ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే నెదర్లాండ్స్ పరిస్థితి ఊహించడం సులభమే. టోర్నీలో ఇప్పటికే సెమీస్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ లాంఛనప్రాయమే. ఈ పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్నాయి.


మరోవైపు నెదర్లాండ్స్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. టేబుల్ టాపర్ అయిన టీమిండియాను ఓడించాలంటే నెదర్లాండ్ సర్వం ఒడ్డాల్సిందే. ఇక, టీమిండియా సెమీస్ మ్యాచలో నవంబర్ 15న న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెమీఫైనల్‌కు ముందు దీపావళి రోజున నెదర్లాండ్స్‌తో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో విక్టరీ కొట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్ బరిలో నిలవాలని రోహిత్ సేన భావిస్తుంది.

టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు ఫర్వాలేదన్పిస్తున్నా.. భారీ స్కోర్లు బాకీ పడ్డారు. బౌలింగ్ లో టీమిండియాకు తిరుగులేదనే చెప్పాలి. షమీ, బుమ్రా, సిరాజ్ త్రయం పెద్ద పెద్ద జట్లను కూడా ముప్పుతిప్పలు పెట్టింది. ఇక, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ల రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు టీమిండియా సొంతం.



Tags

Read MoreRead Less
Next Story