Ind-Wi: 2వ టెస్టులో విజయంపై కన్నేసిన భారత్, 5 వికెట్లు తీసిన సిరాజ్

Ind-Wi: 2వ టెస్టులో విజయంపై కన్నేసిన భారత్, 5 వికెట్లు తీసిన సిరాజ్

India vs Westindies Test: 2వ టెస్టులో భారత జట్టు విజయంపై కన్నేసింది. 5వ రోజు భారత పేసన్ మహ్మద్ సిరాజ్ 5/60 వికెట్లతో విజృంభించడంతో వెస్టిండీస్ 255 పరగులకే ఆలౌటయింది. రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 57 పరుగులు), కీపర్ ఇషాన్ కిషన్‌(34 బంతుల్లో 52)లు వేగంగా అర్ధసెంచరీలు చేయడం, యశస్వి జైస్వాల్, శుభ్ మణ్ గిల్‌లు కూడా రాణించడంతో 24 ఓవర్లలోనే 181 పరుగులు చేసింది. విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

4వ ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. విండీస్ 2 వికెట్లను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తీశాడు. క్రీజులో చందర్‌పాల్(24), బ్లాక్‌వుడ్‌(20)లు ఉన్నారు.

అంతకు ముందు 229 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ని మొదటి ఓవర్లోనే అథనాజ్ వికెట్‌ తీసి ముఖేష్ దెబ్బకొట్టాడు. తర్వాత వచ్చిన బ్యాట్ప్‌మెన్ మహ్మద్ సిరాజ్ ధాటికి నిలవలేకపోయారు. 26 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయారు. భారత్ 184 పరుగుల ఆధిక్యం సాధించింది.


3వ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohith Sharma), యశస్వి జైస్వాల్‌(Yashaswi Jaiswal)లు బజ్‌బాల్ స్ఫూర్తితో వేగంగా ఆడారు. తొలి 10 ఓవర్లలో సుమారుగా 9 పరుగుల రన్‌రేట్ సాధించారు. రోహిత్ శర్మ 36 బంతుల్లోనే అరర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో రోహిత్ 98 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైశ్వాల్ కూడా లంచ్ తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(Ishan Kishan) వచ్చీ రాగానే బౌండరీలతో మొదలెట్టి తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story