Asia Games: భారత్ కు స్వర్ణం ఖాయం: కెప్టెన్ సవిత

Asia Games: భారత్ కు స్వర్ణం ఖాయం: కెప్టెన్ సవిత
గత ఆసియా క్రీడల్లో జపాన్‌ చేతిలో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిపోయిన భారత్... ఈసారి తగ్గేదే లేదంటోన్న కబ్బాడీ క్వీన్స్

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని భారత మహిళల హాకీ కెప్టెన్, స్టార్ గోల్‌కీపర్ సవిత స్పష్టం చేసింది. భారత జట్టు సన్నద్ధత, ప్రదర్శనపై విశ్వాసంతో ఉంది. సెప్టెంబర్‌లో చైనాలో ప్రారంభమవనున్న ఆసియా క్రీడల్లో మహిళల హాకీ జట్టుకు సవిత నాయకత్వం వహించనుంది. సవిత ఇటీవలె ప్రతిష్ఠాత్మక హాకీ ఇండియా బల్బీర్ సింగ్ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. ఇంతకుముందు కామన్‌వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.

హాకీ ఇండియా నిర్వహించిన హాకీ పే చర్చా పోడ్‌కాస్ట్‌లో పలు వివరాలు తెలిపింది. గత ఆసియా క్రీడల్లో బంగారు పతకం చేజార్చుకోవడంపై నిరాశ వ్యక్తం చేసింది. భారత హాకీ కెప్టెన్‌గా తన ప్రయాణం, మహిళా క్రీడాకారిణులకు గుర్తింపు వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించింది.

ఆసియా క్రీడల సన్నద్ధతపై మాట్లాడుతూ.. గత ఆసియా క్రీడల్లో ఫైనల్లో జపాన్‌ చేతిలో కేవలం1 గోల్‌ తేడాతో స్వర్ణ పతకం కోల్పోవడం మససును విరిచేసింది. ఈ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే పారిస్ ఒలంపిక్స్‌కి నేరుగా అర్హత పొందుతామని తెలుసు. కాబట్టి స్వర్ణం గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

గోల్‌కీపర్‌గా, నాయకత్వ బాధ్యతలపై స్పందిస్తూ.. నేను కెప్టెన్‌గా లేకున్నా గోల్‌కీపర్‌గా పలు నాయకత్వ బాధ్యతలు చేయాల్సి ఉంటుంది. కెప్టెన్‌గా చేయడంతో కొన్ని అదనపు బాధ్యతలు వస్తాయి. జట్టులో తక్కువ అనుభవం ఉన్న యువక్రీడాకారిణులతో కెప్టెన్‌గా, క్రీడాకారిణిగా అనుభవాలు పంచుకుని రాటుదేల్చాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. అయితే కోచ్ షాప్‌మాన్ ఆధ్వర్యంలో యువ క్రీడాకారిణులు కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టగలిగేలా రాటుదేల్చాడు అని కోచ్‌ని పొగిడింది.


గత దశాబ్ధ కాలంలో భారత మహిళా హాకీలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయన్నారు. గతంలో నేను 2008 లో జట్టులో వచ్చిన పరిస్థితులతో పోలిస్తే దేశంలో సౌకర్యాలు, మహిళా క్రీడాకారిణులకు గుర్తింపు వంటి అనేక అంశాల్లో చాలా మార్పు వచ్చిందని గుర్తుచేశారు. హాకీ ఇండియా అందించే అవార్డులు క్రీడాకారిణులకు ప్రేరణనిస్తాయని తెలిపింది. ఉత్తమ గోల్‌కీపర్‌గా పురుషుల లేదా మహిళా జట్టులోని క్రీడాకారులనే ఎంపిక చేస్తారనే విషయం తనకు తెలియదన్నారామె.

భారత మహిళా క్రీడాకారిణులకు ఆర్థిక స్వావలంభ మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది.

నేను హాకీ స్టిక్ పట్టిన సమయంలో పరిస్థితులు వేరేగా ఉండేవి. నేను ఉద్యోగం పొందడానికి 9 సంవత్సరాలు పట్టింది. అప్పట్లో కనీసం 2 పూటలా తిండి దొరకడం కష్టంగా ఉండేదని తెలిపింది. కానీ ఆటలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటి క్రీడాకారిణులు ఆర్థికంగా ఎదుగుతుండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది.


Tags

Read MoreRead Less
Next Story