Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ నెలకొల్పిన కింగ్ కోహ్లీ

Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ నెలకొల్పిన కింగ్  కోహ్లీ
ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ

రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ వాంఖడేలో నెలకొల్పిన 50వ శతకంతో మరికొన్ని రికార్డులనూ తుడిచేశాడు. సుదీర్ఘకాలంగా అటకెక్కిన చరిత్ర పుస్తకాల దుమ్మును దులిపేస్తూ వాంఖడేలో కొత్త చరిత్ర లిఖించాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌.. వన్డేలలో నెలకొల్పిన 49 శతకాల రికార్డుతో పాటు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డునూ బ్రేక్‌ చేశాడు.

వన్డేలలో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న తొలి బ్యాటర్‌ కోహ్లీ. 49 సెంచరీలు చేయడానికి 462 ఇన్నింగ్స్‌ తీసుకుంటే కోహ్లీ 279 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత అందుకున్నాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను ఫైనల్‌ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో సచిన్‌ ఇన్నింగ్స్ అతడి కెరీర్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో చేసిన కోహ్లీ సెంచరీ చేసి అలాంటి మన్ననలే పొందాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అనేక రికార్డులను కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‍‌గా విరాట్ కోహ్లీ నూతన చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి.. సచిన్ రికార్డును అధిగమించాడు. ఇదే టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. కివీస్‌తో జరిగిన కీలకపోరులో సెంచరీతో మెరిశాడు.


పదిహేనేళ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 50 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్‌ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును అధిగమించాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు.

సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఇప్పుడు ఆ క్రికెట్‌ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్‌ రికార్డును అధిగమించేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ.... వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... ఇప్పుడు దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story