WorldCup: రిషబ్ పంత్ ఉంటే వరల్డ్‌కప్ భారత్‌దే: శ్రీకాంత్

WorldCup: రిషబ్ పంత్ ఉంటే వరల్డ్‌కప్ భారత్‌దే: శ్రీకాంత్

భారత క్రికెట్ వికెట్‌-కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌తో ఉండి, వరల్డ్ కప్ జట్టులో ఉంటే కచ్చితంగా భారతే కప్ గెలుస్తుందని మాజీ క్రికెటర్, సెలెక్టర్ క్రిష్ణమాచార్య శ్రీకాంత్ అన్నాడు. అయితే పంత్ లేకున్నా భారత్‌కి కప్ తెచ్చే ఆటగాళ్లు జట్టులో ఉన్నారని అన్నాడు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ నిజంగా ఆడతాడో లేదో తెలియదు. రిషబ్ పంత్ ఒకవేళ ఆడితే వరల్డ్‌కప్‌ గెలిచేది భారతే అని నేను ఖచ్చితంగా చెప్పగలనన్నాడు. కానీ రిషబ్ ఫిట్‌నెస్ సందేహంగానే అనిపిస్తోంది. అసలు అతను వరల్డ్‌కప్‌లో ఆడతాడో లేదో అని అనుకుటుంటున్నారన్నాడు. ఒకవేళ ఆడితే అతను భారత్‌కు చాలా కీలకం అవుతాడన్నాడు.



భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ... KL రాహుల్ మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుదన్నాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా ఉంటే, తర్వాత ఆర్డర్‌లో వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ వస్తాడు. వీరు రాణిస్తే భారత్‌కు వరల్డ్‌కప్ గెలిచే సత్తా ఉందని వివరించాడు.

25 యేళ్ల రిషబ్ పంత్ కారులో తన ఇంటికి వెళ్తుండగా, గత డిసెంబర్‌లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ ప్రస్తుతం చికిత్స పొందుతూ, తన రికవరీకి సంబంధించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

అక్టోబర్ 5 నుంచి ICC క్రికెట్ వరల్డ్ కప్‌ ప్రారంభమవనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 8న ఆడనుంది.




Tags

Read MoreRead Less
Next Story