India vs WI: స్పిన్నర్ల ధాటికి విండీస్ విల విల, మొదటి వన్డే భారత్‌దే

India vs WI: స్పిన్నర్ల ధాటికి విండీస్ విల విల, మొదటి వన్డే భారత్‌దే
88 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన విండీస్ భారత స్పిన్నర్ల జోరుకు మిగిలిన 6 వికెట్లను కేవలం 26 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకుంది.

India vs Westindies: భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ జట్టు బెంబేలెత్తిపోయింది. మొదటి వన్డేలో కేవలం 114 పరగులకే ఆలౌటయింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా(3/37) విజృంభిచడంతో స్వల్వ స్కోర్‌కే అన్ని వికెట్లను కోల్పోయారు.కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్‌లో రెండో వన్డే 29న జరగనుంది.

115 పరుగుల లక్ష్యాన్ని ఇషాన్ కిషన్(51) అర్ధసెంచరీతో రాణించడంతో 22.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే చివరల్లో వరుసగా వికెట్లు కోల్పోయి కొంత కంగారు పెట్టినా, రోహిత్ శర్మ(12) విజయ తీరాలకు చేర్చాడు.

మొదట బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ ఆరంభం నుంచే పేలవంగా ఆడింది. 3వ ఓవర్లోనే కైల్ మేయర్స్(2) హార్దిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అథనాజ్‌(22), ఓపెనర్‌ కింగ్‌తో కలిసి ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అథనాజ్ 45 పరుగుల వద్ద జడేజా పట్టిన అద్భుత క్యాచ్‌కి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన షై హోప్(43), హెట్‌మైర్‌(11)లు నిలదొక్కుకుననట్లు కనిపించినా అనవసర షాట్‌కు ప్రయత్నించిన హెట్‌మైర్ జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 88 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన విండీస్ భారత స్పిన్నర్ల జోరుకు మిగిలిన 6 వికెట్లను కేవలం 26 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకుంది.


లక్ష్య ఛేదనలో భారత్ కొత్త ప్రయోగం చేసింది. ఓపెనర్లుగా శుభ్మన్‌ గిల్‌కి జోడీగా రోహిత్‌ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలో దిగాడు. టెస్టుల్లో రాణించని గిల్ వన్డేలోనూ 7 పరుగులకే వెనుదిరిగాడు. వచ్చీ రాగానే సూర్యకుమార్‌ యాదవ్ కూడా బౌండరీలతో ఖాతా తెరిచాడు. తాను చేసిన 19 పరుగుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. జోరు మీద ఉన్న సూర్య కుమార్‌ని గుడాకేష్ ఎల్బీగా ఔట్ చేశాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ బౌండరీలతో 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు హార్ధిక్ పాండ్యా(5) అనుకోకుండా రనౌటై వెనుదిరిగాడు.

చివర్లో 21 పరుగులు చేయాల్సిన దశలో అర్ధసెంచరీ చేసిన ఇషాన్ కిషన్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. వెంటనే శార్దూల్ ఠాకూర్ కూడా పెవిలియన్ చేరడంతో కొద్దిగా ఒత్తిడి నెలకొన్నా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజాలు భారత్‌కు విజయంతో ముగింపు ఇచ్చారు. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి దిగే అవకాశం లేకపోయింది.

Tags

Read MoreRead Less
Next Story