LEO MESSI: ఫుట్‌బాల్ మాంత్రికుడు మెస్సీ బర్త్‌ డే.. స్పెషల్ స్టోరీ

LEO MESSI: ఫుట్‌బాల్ మాంత్రికుడు మెస్సీ బర్త్‌ డే.. స్పెషల్ స్టోరీ

ఫుట్‌బాల్ మాంత్రికుడు, రికార్డుల రారాజు, అర్జెంటీనీయుల ఆరాధ్య దైవం, ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లలో ఒకడు.. ఇవన్నీ ఒక్క వ్యక్తి గురించే. అతడే అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ అండ్రూ మెస్సీ. మెస్సీ అంటే తెలియని వారుండరు అంటే అతియోశక్తి కాదేమో..!

తనకే సాధ్యమైన ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అసాధారణ డ్రిబ్లింగ్ స్కిల్స్, వేగం మెస్సీ సొంతం. తన కెరీర్‌ మొత్తంలో అంతర్జాతీయ, క్లబ్ స్థాయిల్లో 1028 మ్యాచ్‌లు ఆడి, 807 గోల్స్‌ సాధించి GOAT (Greatest Of the All Time) గా అభిమానుల గుండెల్లో నిలిచాడు.

ఫుట్‌బాల్ క్రీడలో ఉన్న దాదాపు అన్ని ప్రతిష్టాత్మక టైటిళ్లను అతను గెలుపొందాడు.

ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఫిఫా వరల్డ్‌ కప్‌ని 2022 లో ముద్దాడిన క్షణాల్ని అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

అర్జెంటీనా జాతీయజట్టు తరపున ఆడే మెస్సీ, క్లబ్ ఫుట్‌బాల్‌లో స్పెయిన్‌లోని బార్సిలోనా క్లబ్‌కు 18 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించి టైటిళ్లను అందించాడు. ఇటీవలె పారిస్‌ సెయింట్‌-జర్మైన్ (PSG) నుంచి అమెరికాలోని ఇంటర్ మియామి క్లబ్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్థానం..

అర్జెంటీనాలోని రోసారియాలో, 1983 జూన్‌ 24న జన్మించాడు. 10 యేళ్ల వయసులో మెస్సీకి గ్రోత్ హార్మోన్ లోపం చికిత్సకయ్యే ఖర్చు తండ్రికి స్థోమతకు మించిన భారం అయ్యేది. స్పెయిన్‌లోని బార్సిలోనా క్లబ్ మెస్సీ ప్రతిభకు అబ్బురపోయి, చికిత్సకయ్యే ఖర్చు భరించడానికి ఒప్పుకుంది.

బార్సిలోనా ఆల్ టైం గ్రేట్..

బార్సిలోనా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత మెస్సి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బార్సిలోనా తరఫున 778 మ్యాచులు ఆడి, 672 గోల్స్‌ చేసి ఆల్ టైం టాప్ గోల్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అతని వెంటే రికార్డులు, టైటిళ్లు.

2014 లో వరల్డ్ కప్‌ ఫైనల్లో జర్మనీ చేతిలో తృటిలో వరల్డ్ కప్ చేజార్చుకున్న మెస్సీ, ఖతార్‌లో 2022 లో జరిగిన వరల్డ్ కప్‌ని ఒడిసిపట్టి, అర్జెంటీనా చిరకాల కోరికను తీర్చి, లెజెండ్‌ మారడోనా సరసన చేశాడు. ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్‌ని కూడా గెలిచాడు.

యూరప్‌లో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ ఛాంపియన్స్‌ లీగ్‌ను బార్సిలోనా తరఫున 4 సార్లు ఎత్తుకున్నాడు. స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్స్‌ అయిన లా లిగాను రికార్డు స్థాయిలో 10 సార్లు, పారిస్‌లో లీగ్‌-1 ట్రోఫీలను ఆడిన 2 సీజన్లలోనూ గెలిచాడు.

వరల్డ్‌కప్‌లో అతని ఆటతీరుకి 2014, 2022 సంవత్సరాల్లో గోల్డెన్‌బాల్ అవార్డు వరించింది.

అత్యుత్తమ ఆటగాళ్లకి ఇచ్చే బాలన్‌ డీ'ఓర్ పురస్కారాన్ని ఎవ్వరికీ సాధ్యంకాని రీతిలో 7 సార్లు గెలుచుకున్నాడు. అలాగే ఒక సీజన్‌లో అత్యధికంగా 91 గోల్స్‌ కొట్టి గిన్నిస్‌ రికార్డ్ కూడా నెలకొల్పాడు.






Tags

Read MoreRead Less
Next Story