ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు...

ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు...
ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే.. నేరుగా ఖైరతాబాద్‌ వెళ్లి తన తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధి దగ్గరకు వెళ్లాడు.

ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే.. నేరుగా ఖైరతాబాద్‌ వెళ్లి తన తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధి దగ్గరకు వెళ్లాడు. అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. నాన్న కలను నిజం చేసే అవకాశం దక్కినందుకు తాను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పాడు.

సిరాజ్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన కొన్ని రోజులకే తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. దీనితో స్వదేశానికి రాకుండా దేశం తరపున ఆడాలన్న తండ్రి కలను నిజం చేశాడు సిరాజ్. కాగా సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవారు‌. కొడుకును టీమిండియా క్రికెటర్‌గా చూడాలనే కోరికతో ఆయన చాలా కష్టాలను ఎదురుకున్నారు.

2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ను చూసి ఎంతో మురిసిపోయారు. కాగా, బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. టెస్టు సిరీస్‌లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. చివరి టెస్టు గబ్బాలో కీలక పాత్ర పోషించాడు.



Tags

Read MoreRead Less
Next Story