India A-Pakistan A: ఫైనల్లో పాక్‌ చేతిలో భారత్ ఘోర ఓటమి

India A-Pakistan A: ఫైనల్లో పాక్‌ చేతిలో భారత్ ఘోర ఓటమి
సిక్సులు, ఫోర్లతో 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన తాహిర్, 24 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడంటే ఎలా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. చివరికి 45వ ఓవర్లో 313 పరుగుల వద్ద 6వ వికెట్‌గా వెనుదిరిగాడు.

ACC Men's Emerging Cup: ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌-ఏ చేతిలో భారత్-ఏ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 128 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో యువ భారత జట్టు 40 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దాయాదిపై కప్ గెలిచిన పాక్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు.

టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించిన భారత్‌, 356 పరుగుల భారీ లక్ష్యఛేదనలో చతికిలపడింది. భారత్ తన చివరి 7 వికెట్లను 67 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.


భారీ స్కోరే అయినా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్‌ల నుంచి మంచి శుభారంభమే లభించింది. ఓవర్‌కి 8 పరుగులకి పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. ఇదే టోర్నీలో పాకిస్థాన్‌పై సెంచరీ సాధించిన సాయిసుదర్శన్ 9వ ఓవర్లో వెనుదిరిగాడు. మరో బ్యాట్స్‌మెన్ జోస్ కూడా 9 పరుగులకే వెనుదిరిగాడు. అభిషేక్, యశ్ ధుల్‌లు ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలిసి 16వ ఓవర్లో 100 పరుగులు దాటించారు. అభిషేక్‌ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత యశ్‌ధుల్, అభిషేక్‌ శర్మలు సిక్సులతో స్కోర్‌బోర్డ్ పెంచారు. అభిషేక్ 132 పరుగుల వద్ద ఔటవ్వడంతో భారత్ 20 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అభిషేక్ ఔటైన తర్వాత భారత్ ఎక్కడా కోలుకోలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. 157 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయి, మరో 2 పరుగుల తర్వాత కెప్టెన్ యశ్‌ధూల్ కూడా భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. తర్వాత 65 పరుగులు మాత్రమే చేసిన భారత్ మిగిలిన 6 వికెట్లను కోల్పోయి ఓటమి పాలయ్యింది. చివరికి 224 పరుగుల వద్ద యువ్‌రాజ్ సిన్హ్ చివరి వికెట్‌గా బౌల్డవడంతో పాక్ ఆటగాళ్ల ఆనందానికి పగ్గాల్లేకుండా పోయింది.


అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు తయ్యబ్ తాహిర్ విధ్వంసకర ఆటతో 344 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సయీం, ఫర్హాన్‌లు భారీ షాట్లతో అర్ధసెంచరీలతో రాణించి భారీ స్కోర్‌కి బాటలు వేశారు. భారత్‌కు 18వ ఓవర్‌లో 121 పరుగుల వద్ద గానీ మొదటి వికెట్ లభించలేదు. 27వ ఓవర్‌లో వరుస బంతుల్లో యూసుఫ్, అక్రంలను రియాన్ పరాగ్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో పాక్‌ 5వ వికెట్‌ని కూడా కోల్పోవడంతో పాక్ తక్కువ స్కోర్‌కే కట్టడి చేయొచ్చనిపించింది.

కానీ తాహిర్ తయ్యుబ్ అప్పుడే తన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆరంభించాడు. సిక్సులు, ఫోర్లతో 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన తాహిర్, 24 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడంటే ఎలా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. చివరికి 45వ ఓవర్లో 313 పరుగుల వద్ద 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కూడా భారీ షాట్లు ఆడటంతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగులు సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story