PAKvsSL: కొండంత లక్ష్యాన్ని ఛేదించిన పాక్‌

PAKvsSL: కొండంత లక్ష్యాన్ని ఛేదించిన పాక్‌
ప్రపంచకప్‌లో అతిపెద్ద పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు

ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే పాక్‌ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (113; 103 బంతుల్లో 10×4,3×6), మహ్మద్‌ రిజ్వాన్ (134; 121 బంతుల్లో 9×4, 3×6) శతకాలతో చెలరేగిన వేళ విజయం పాక్‌ వశమైంది. శ్రీలంక బౌలర్లలో మదుశనక 2 వికెట్లు తీయగా, తీక్షణ, పతిరణ చెరో వికెట్‌ తీశారు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద పరుగుల ఛేజింగ్.


అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (122; 77 బంతుల్లో 14×4, 6×6), సమరవిక్రమ (108;89 బంతుల్లో 11×4,2×6) శతకాలు చేయగా, నిశాంక (51;61 బంతుల్లో 7×4,1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ 4 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రాఫ్‌ 2, షహీన్‌ అఫ్రిది, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్ తీశారు. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించలేకపోయింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడగా, ప్రతిసారీ పాక్ జట్టు శ్రీలంకను ఓడించింది. ఈసారి కూడా శ్రీలంకపై పాక్ విజయ పరంపర కొనసాగింది. పాక్ జట్టులో అబ్దుల్లా షఫీక్ 103 బంతుల్లో 113 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో మహ్మద్ రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటిలోనే ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ త్వరగా పెవిలియన్‌కు చేరారు. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది విజయాన్ని అందుకున్నారు. ఇఫ్తికార్ అహ్మద్ 10 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీ మార్కు దాటారు. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ సెంచరీలు సాధించారు. ఛేజింగ్‌లో పాకిస్థాన్ తరఫున మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ సెంచరీలు కొట్టారు. శ్రీలంక బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ రికార్డు సృష్టించాడు. కుశాల్ మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. కుశాల్ మెండిస్ 65 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు.

Tags

Read MoreRead Less
Next Story