Prithvi Shaw: కింద పడితే వదిలేస్తారు బ్రదర్‌..

Prithvi Shaw: కింద పడితే వదిలేస్తారు బ్రదర్‌..
మరోసారి టీమిండియా యువ బ్యాటర్‌ పృథ్వీ షా తీవ్ర భావోద్వేగం.... విజయం సాధిస్తేనే చేయి అందిస్తారని పోస్ట్‌...

టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా(Prithvi Shaw) మరోసారి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 23 ఏళ్ల వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న షా ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఆసక్తికర పోస్టు‌( cryptic post) పెట్టాడు. జీవితంలో పైకి ఎదిగినప్పుడు ప్రజలు చేయి అందిస్తారని, అదే కిందికి పడిపోతునప్పుడు ప్రతిసారి చేయి వదిలేస్తారని(People always leave) పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌కు మోకాలి గాయంతో మెట్లు దిగుతున్న ఫొటోను జత చేశాడు. విజయాలు సాధించినప్పుడు పలకరించే జనాలు.. కష్టాల్లో ఉంటే కనబడరని, దారిదాపుల్లోకి కూడా రారని పృథ్వీ షా(Prithvi Shaw's cryptic post) పేర్కొన్నాడు. గాయం నుంచి పృథ్వీ షా త్వరగా కోలుకోవాలని సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆకాంక్షించాడు. ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టిన అర్జున్.. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మానసికంగా బలంగా ఉండు బడ్డీ అంటూ పోస్ట్‌ చేశాడు.


ఇటీవల ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌(Royal London One-Day Cup )లో పృథ్వీ షా అదరగొట్టాడు. నార్తంప్టన్‌షైర్‌( Northamptonshire ) తరఫున ఆడిన మూడో మ్యాచ్‌లోనే పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా (244; 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లు) బాదేశాడు. తర్వాత డర్హామ్‌పై 76 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులే చేశాడు. కానీ ఆగష్టు 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల పృథ్వీ షా విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 28 ఫోర్లు, 11 సిక్సులతో 153 బంతుల్లోనే 244 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఆగష్టు 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 15 ఫోర్లు, 7 సిక్సులతో 76 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లోనే 429 పరుగులు చేసిన పృథ్వీ షా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు .


రాయల్‌ వన్డే-కప్‌లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీతోపాటు సెంచరీ బాది భీకరమైన ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా మళ్లీ ఫిట్‌నెస్ సాధించి ఫామ్‌లోకి వచ్చాడని భావించే సమయంలోనే గాయంబారిన పడటంతో ఎప్పుడు జట్టులోకి వస్తాడనేది సందిగ్ధంగా మారింది.

భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా పృథ్వీ షా కౌంటీలు ఆడుతున్నాడు. తన గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో ఇప్పుడే ఆలోచించబోనని.. కౌంటీల్లో రాణించడంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు. మంచి ఫామ్‌లో ఉండి రాణిస్తున్న వేళ ఇలా గాయపడడం... జాతీయ జట్టులోకి రావాలన్న షా ఆశలకు పెద్ద అవరోధంగా మారనుంది.

Tags

Read MoreRead Less
Next Story