Prithvi Shaw: పృథ్వీ షా ఊచకోత

Prithvi Shaw: పృథ్వీ షా ఊచకోత
విధ్వంసకర డబుల్‌ సెంచరీతో చెలరేగిన షా... పలు రికార్డులు బద్దలు.. ఇక టీమిండియాలోకి రావడమే మిగిలిందన్న అభిమానులు...

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw ) చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసం సృష్టించాడు. జాతీయ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న షా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల తలుపు తట్టాడు. తొలిసారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్న పృథ్వీ షా నార్తాంప్టన్ షైర్ జట్టు) Northamptonshire) తరఫున బరిలోకి దిగి సోమర్‌సెట్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఏ ఒక్క బౌలర్‌ను వదిలి పెట్టకుండా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్ల (28 boundaries and 11 sixes )సాయంతో 244 పరుగులు( record-breaking double hundred) చేశాడు. షా ధాటికి నార్తంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సోమర్‌సెట్‌ బౌలర్లంతా షా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్‌ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.


ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన షా దాదాపుగా ప్రతి బంతిని ఫోర్ లేదా సిక్సు బాదుతూ బౌలర్లను ముప్పతిప్పలుపెట్టాడు. పృథ్వీషా విధ్వంసం ధాటికి నార్తాంప్టన్‌షైర్‌ స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. టీ20 స్టైల్‌లో విధ్వంసం సృష్టించిన పృథ్వీ షా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన పృథ్వీ షా మొత్తంగా 153 బంతులు ఎదుర్కొని 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగులు బాదేశాడు. షా స్ట్రైక్ రేట్ ఏకంగా 159గా ఉండడం గమనార్హం. ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. షా విధ్వంసంతో నార్తాంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల స్కోర్ సాధించింది.


ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పృథ్వీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే కప్‌(Northamptonshire in England's One-Day Cup)లో ఓలీ రాబిన్సన్, ఓర్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోర్ 206 పరుగులను పృథ్వీ షా అధిగమించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. పురుషుల లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. రాయల్ లండన్ వన్డే టోర్నీలో డబుల్ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగంగా డబులు సెంచరీ కొట్టిన ఆటగాడిగా షా రికార్డు సృష్టించాడు.

అనంతరం సోమర్‌సెట్‌ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో పృథ్వీ షా 34, 26 పరుగులు మాత్రమే చేశాడు. పృథ్వీ షా 2018లోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ కూడా కొట్టాడు. 2020లో వన్డేల్లో, 2021లో టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story