PV Sindhu: జపాన్ ఓపెన్‌లో సింధు ఓటమి, కొనసాగుతున్న పేలవ ఫామ్

PV Sindhu: జపాన్ ఓపెన్‌లో సింధు ఓటమి, కొనసాగుతున్న పేలవ ఫామ్

భారత ఏస్ షట్లర్ పీవీ సింధు బుధవారం జరిగిన జపాన్ ఓపెన్-2023 లో రౌండ్-ఆఫ్-32 పోరులో చైనాకు చెందిన జాంగ్ యిమాన్‌తో 21-12, 21-13 తేడాతో ఓడిపోయింది. వరుస సెట్లలో పరాజయం పాలైన భారత షట్లర్ ప్రత్యర్థి జోరుకు తలవంచింది. యిమాన్ సునాయాసంగా విజయం సాధించగా, పీవీ సింధు పాయింట్లు సాధించడానికి చాలా కష్టపడింది.

సింధు తన 12 BWF టోర్నమెంట్‌లలో ఆరింటిలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశాజనకమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ నెలలో సింధు కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుండి చైనీస్ తైపీకి చెందిన పై యు పో చేతిలో 18-21, 21-10, 13-21 తేడాతో 58 నిమిషాల్లోనే ఓడిపోయింది.

సింధు తన నిరుత్సాహకర ఆటతీరుతో BWF ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి పడిపోయింది, ఒక దశాబ్దంలో తాను సాధించిన అత్యంత కనిష్ఠ ర్యాంకు ఇదే. ఇంతకు ముందు అత్యుత్తమంగా 2016 సంవత్సరంలో 2వ ర్యాంకులో నిలిచింది.

2 సంవత్సరాలుడా కోచ్ లేకుండా ఆడిన సింధు గత వారమే మలేషియాకు చెందిన మహ్మద్ హఫీజ్‌ని తన వ్యక్తిగత కోచ్‌గా నియమించుకుంది. హఫీజ్ 2024 పారిస్ ఒలంపిక్స్ వరకు సింధుకు కోచ్‌గా ఉండనున్నాడు. హైదరాబాద్‌లోని సుచిత్రా బ్యాడ్మింటన్‌ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తోంది.

జపాన్ ఓపెన్‌లో ప్రదర్శనను ఒలంపిక్స్‌కి అర్హత ర్యాంకింగ్‌లకి పరిగణలోకి తీసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story