PV sindhu : డెన్మార్క్‌ ఓపెన్‌.. క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు నిష్క్రమణ..!

PV sindhu : డెన్మార్క్‌ ఓపెన్‌..  క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు నిష్క్రమణ..!
PV sindhu : డెన్మార్క్‌ ఓపెన్‌లో వరల్డ్ టూర్ సూపర్_100 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది.. సింధు క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.
PV sindhu : డెన్మార్క్‌ ఓపెన్‌లో వరల్డ్ టూర్ సూపర్_100 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది.. సింధు క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. నిన్న (శనివారం) జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 11–21, 12–21తో సెయంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది.. ప్రత్యర్ధి అన్నిరంగాల్లో పై చేయి సాధించడంతో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్‌ సెయంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. అటు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ తొలి గేమ్‌ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.

Tags

Read MoreRead Less
Next Story