పీవీ సింధు కులం ఏంటి..? అంటూ గూగుల్ లో సెర్చ్

పీవీ సింధు కులం ఏంటి..? అంటూ గూగుల్ లో సెర్చ్
PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం సాధించింది.

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. దాంతో వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఎదైనా దేశం నుంచి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్లినప్పుడు.. ప్రజలు వాళ్ల ట్రాక్ రికార్డు గురించి సెర్చ్ చేస్తారు. కానీ, గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ ఆటగాళ్ల కులాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు తెలుగు తేజం పీవీ సింధు విషయంలో ఇదే జరిగింది.

టోక్యో ఒలింపిక్స్ లో ఆగస్టు 1 న కాంస్య పతకం గెలిచింది. దాంతో నెటిజన్లు సింధు గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ సెర్చ్ ను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఆమె కుటుంబం గురించి సెర్చ్ చేస్తుంటే.. మరికొందరు ఆమె చదువు గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంకొందరు సింధు ఇల్లు గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే పీవీ సింధు కులం గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసినట్లుగా కనిపిస్తున్నది. ఆగస్టు 1 న పీవీ సింధు కులం(PV Sindhu Caste) అనే కీవర్డ్ గూగుల్ లో ట్రెండ్ అయింది. ఆగస్టు 1 న పీవీ సింధు కులం గురించి సెర్చింగ్‌ 700 శాతం పెరిగింది. పీవీ సింధు కులమేంటో తెలుసుకోవడానికి ఏపీ, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తెలుస్తుంది.

పీవీ సింధు కులం తెలుసుకునే గూగుల్ సెర్చ్‌లో ఏపీ తొలి స్థానంలో ఉండగా.. జార్ఖండ్ 2వ స్థానం, తెలంగాణ 3వ, ఉత్తరప్రదేశ్ 4వ, బిహార్ 5వ స్థానంలో ఉన్నాయి. అయితే సింధు కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఆగస్టులో సింధు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత కూడా ఆమె కులం ఏంటో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపారు. ఇక ఇదే టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజతం సాధించి దేశం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.





Tags

Read MoreRead Less
Next Story