భారత్‌,పాక్ మ్యాచ్‌ రద్దయితే స్టార్ స్పోర్ట్స్‌కు వచ్చే నష్టం ఎంతో తెలుసా?

భారత్‌,పాక్ మ్యాచ్‌ రద్దయితే స్టార్ స్పోర్ట్స్‌కు వచ్చే  నష్టం ఎంతో తెలుసా?

భారత్‌,పాక్ క్రికెట్ పోరుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ఎవ్వరి వ్యూహాల్లో వారు ఉంటారు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ వర్షంతో రద్దయితే మాత్రం నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో దాదాపు 200 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనా.. ఇక భారత్ ,పాక్ పోరుకు సైతం వరుణుడు ముప్పు ఉండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.

ఇంగ్లాండ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అక్కడ జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మెగా టోర్నీ ప్రారంభమైన రెండు వారాల నుంచి ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. వీటిలో ఒక్క బంతి కూడా పడకుండా మూడు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఈ మ్యాచ్‌లకు కలిపి నిర్వాహకులకు సుమారు రూ.180 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక ఆదివారం భారత్‌ , పాక్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌పై వర్ష ప్రభావం కొనసాగితే దాని నష్టం భారీ మొత్తంలో ఉంటుంది. ఈ ఒక్క మ్యాచ్‌ పైనే సుమారు రూ.137.5 కోట్ల వ్యాపారం జరగుతోంది. ప్రపంచకప్‌ టోర్నీ ప్రసారాలను సొంతం చేసుకున్న స్టార్‌స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈ నష్టాలను అధిక మొత్తంలో భరించాల్సిన పరిస్థితి నెలకొంది. క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారం చేసే ఛానల్స్‌ 5,500 సెకండ్ల పాటు అడ్వర్‌టైజ్‌ కంపెనీలకు టైమ్‌స్లాట్‌ కేటాయిస్తాయి. స్టార్‌స్పోర్ట్స్‌ ఛానల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు సాధారణంగా 10 సెకన్లకు 16 లక్షల వరకూ వసూలు చేస్తోంది. కాగా భారత్‌ X పాక్‌ మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు మాత్రం 10 సెకన్ల ప్రకటను 25 లక్షల రూపాయలు అడ్వర్టైజింగ్‌ రేట్‌ను పెంచింది. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోవడమే ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా పలు కంపెనీలు తమ ప్రకటనలకు అధిక ప్రధాన్యం ఇస్తున్నాయి. వీలైనంత మేర ప్రజలకు చేరుకునేందుకు ఇదే సరైన మార్గమని ఆయా కంపెనీలు భావిస్తుండడంతో ఎంత రేటైనా వెనక్కి తగ్గడం లేదు. ఈ మ్యాచ్ ద్వారా స్టార్ స్పోర్ట్స్ 100 కోట్ల నుంచి 140 కోట్ల వరకూ ఆర్జించేందుకు

సిధ్ధమైంది.

ఇదిలా ఉంటే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలుండడంతో నిర్వాహకులతో పాటు స్టార్ స్పోర్ట్స్‌కూ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే.. స్టార్‌స్పోర్ట్స్‌ సుమారు రూ.140 కోట్ల మేర నష్టపోనుంది. అయితే ఛానల్‌ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా బీమా తీసుకోవడంతో ఆ నష్టాల్ని బీమా కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కంపెనీలు ఇంత మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించేందుకు విముఖత చూపిస్తున్నాయి. దీంతో స్టార్‌స్పోర్ట్స్‌తో అడ్వర్‌టైజింగ్‌ ఒప్పందాలు చేసుకున్న కోకాకోలా, ఉబర్‌, వన్‌ప్లస్‌, ఎమ్మారెఫ్‌ టైర్స్‌ వంటి కంపెనీలు సైతం నష్టపోయే అవకాశముంది. మరి భీమా కంపెనీలతో సయోధ్య కుదిరితే తప్ప స్టార్‌స్పోర్ట్స్‌కు నష్టం భారీగానే ఉండబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story