Rishabh Pant: బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌

Rishabh Pant: బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌
లోకల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో వైరల్‌... త్వరలోనే మైదానంలోకి వస్తాడంటూ కామెంట్ల హోరు

గతేడాది చివర్లో రోడ్డు ప్రమాదం( car crash)లో తీవ్రంగా గాయపడిన స్టార్‌ బ్యాటర్‌, వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. పంత్‌ ఓ లోకల్ మ్యాచ్‌(during his batting practice)లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది(breaks internet). ఈ మ్యాచ్‌లో రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన రిషబ్ పంత్(Rishabh Pant).... భారీ షాట్ల(Pant's shots)తో విరుచుకుపడ్డాడు. ఈ వీడియోతో పంత్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అతి త్వరలోనే పంత్‌ టీమ్‌ఇండియాలోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత జట్టే అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లోనూ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో ఆసియా కప్‌నకు ప్రకటించే జట్టులో ఇందులో పంత్‌ను పరిగణనలోకి తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


30 డిసెంబర్ 2022న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్(wicketkeeper-batter Rishabh Pant) తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి శస్త్ర చికిత్స( ligament surgery ) కూడా జరగడంతో దాదాపు 3 నెలలు మంచానికే పరిమితయ్యాడు. ఆ తర్వాతి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ‍(NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. కాగా రిషబ్ పంత్(PANT) వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా టీమిండియా(team india)లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.


జాతీయ క్రికెట్‌ అకాడమీ(National Cricket Academy)లో ఉన్న కేఎల్ రాహుల్‌( KL Rahul), శ్రేయస్‌ అయ్యర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పంత్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కోలుకుని పంత్ త్వరలోనే టీమిండియాలోకి వస్తాడని ఆశిస్తున్నారు. కాగా 30 డిసెంబర్ 2022న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కాలికి శస్త్ర చికిత్స కూడా జరగడంతో దాదాపు 3 నెలలు మంచానికే పరిమితయ్యాడు. ఆ తర్వాతి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ కోలుకుంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story