ఫుట్‌బాల్ స్టార్ 'రొనాల్డో' చెప్పిన ఒక్క మాటతో 'కోకాకోలా' కి రూ. 29వేల కోట్ల నష్టం..

ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో చెప్పిన ఒక్క మాటతో కోకాకోలా కి రూ. 29వేల కోట్ల నష్టం..
ఆ కంపెనీ.. వాళ్లు ఆడే ఆటకు స్పాన్సర్లు కావచ్చు. అయితేనేం కుండబద్దలు కొట్టాడు. తను చేసేదే అభిమానులకు చెప్పాడు. ఫలితంగా సదరు కంపెనీ ఒక్క రోజులో 29వేల కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

ఆ కంపెనీ.. వాళ్లు ఆడే ఆటకు స్పాన్సర్లు కావచ్చు. అయితేనేం కుండబద్దలు కొట్టాడు. తను చేసేదే అభిమానులకు చెప్పాడు. ఫలితంగా సదరు కంపెనీ ఒక్క రోజులో 29వేల కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది. పోర్చుగల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు రొనాల్డో క్రిస్టియానా ఎంత పవర్‌ఫుల్లో ఈ విషయం చెప్పకనే చెబుతుంది.

హంగరీతో జరిగే మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో తన ముందు పెట్టిన కోకాకోలా బాటిళ్లను చూసిన పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో ​​రొనాల్డో రెచ్చిపోయాడు. రొనాల్డో కోకా కోలాకు బదులుగా నీరు త్రాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అతడి ముందు ఉంచిన రెండు కోక్ బాటిళ్లను పక్కకు పెట్టాడు. ఈ కారణంగా, కోకాకోలాను తయారుచేసే సంస్థ ఒకే రోజులో రూ .29000 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

పోర్చుగల్ యొక్క స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో ​​రొనాల్డో మైదానంలో, వెలుపల ఒకేలా ఉంటాడు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తాడు. యూరో 2020 లో 35 ఏళ్ల రొనాల్డో మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. యూరో కప్ తొలి మ్యాచ్‌లో పోర్చుగల్ హంగేరిని 3-0తో ఓడించగా, కెప్టెన్ రొనాల్డో చివరి నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. దీంతో రొనాల్డో యూరో కప్‌లో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచాడు. అతను ఇప్పుడు యూరో కప్‌లో 11 గోల్స్ చేసి మాజీ స్టార్ ప్లేయర్ మైఖేల్ ప్లాటిని (9 గోల్స్) అధిగమించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు రొనాల్డో మరొక కారణంతో వెలుగులోకి వచ్చాడు.

మ్యాచ్‌కు ముందు రొనాల్డో విలేకరుల సమావేశానికి వచ్చిన వెంటనే, టేబుల్ మీద తన ముందు ఉంచిన కోకాకోలా బాటిల్స్ చూశాడు. వెంటనే స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు స్వయంగా కోక్ బాటిల్‌స్‌ను తొలగించి, ఆ తర్వాత వాటర్ బాటిల్‌ను తీసుకొని కోకాకోలాకు బదులుగా నీరు తాగమని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. రొనాల్డో యొక్క ఈ విజ్ఞప్తి తరువాత, కోకాకోలాను తయారు చేసే సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సంస్థ యూరో కప్‌కు స్పాన్సర్ కూడా. 'ది డైలీ స్టార్' ప్రకారం, రొనాల్డో విజ్ఞప్తి తరువాత కోకాకోలా తయారీదారు షేర్లు 1.6 శాతం తగ్గాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే, కంపెనీ ఒక రోజులో 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ .29,300 కోట్లు) నష్టాన్ని చవిచూసింది.

వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిన కోకాకోలా కంపెనీ.. ''ప్రతి ఒక్కరికి నచ్చిన డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంటుంది అని పేర్కొంది.

ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదిగిన రొనాల్డో 36 ఏళ్ల వయసులో కూడా తన కంటే వయసులో చిన్న వారిని మైదానంలో మట్టి కరిపిస్తాడు. ఫుట్‌బాల్ ఆట ఆషామాషీ క్రీడ కాదు. దాదాపు 90 నిమిషాల పాటు క్రీడాకారుడు అత్యంత చురుగ్గా ఉండాలి. అందుకే 30 ఏళ్లు దాటిన క్రీడాకారులు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ రొనాల్డో వారికి పూర్తి భిన్నంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ మరింత ఫిట్‌గా తయారవుతున్నాడు. ఆహార నియమాల విషయంలో రొనాల్డో కఠినంగా ఉంటాడు.

ప్రతిరోజూ ఆరు సార్లు మితంగా ఆహారాన్ని తీసుకుంటాడు. వీటిలో పండ్లు, కూరగాయలు, చికెన్ లేదా ఫిష్ ఉండేలా జాగ్రత్త పడతాడు. మంచి నీరు ఎక్కువగా తాగుతాడు. వారంలో ఐదు రోజులు కార్డియాక్ ఎక్సర్‌సైజులు చేస్తాడు. రోజుకి మూడు గంటలు వ్యాయామానికి కేటాయిస్తాడు. నిత్యం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటాడు. 10 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా ఫుట్ బాల్ క్రీడాకారునిగా తయారు చేయడానికి తర్ఫీదు ఇస్తున్నాడు. అతడి ఆహార నియమావళిని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. శీతల పానీయాల పట్ల ఆకర్షితుడైతే తండ్రి చేతిలో చీవాట్లే అతడికి.

Tags

Read MoreRead Less
Next Story