క్రీడలు

Shikhar Dhawan : మహిళా క్రికెటర్ తో శిఖర్ ధావన్ పెళ్లి?

Shikhar Dhawan : నెల క్రితం తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయిన ధావన్.. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది.

Shikhar Dhawan :  మహిళా క్రికెటర్ తో శిఖర్ ధావన్ పెళ్లి?
X

Shikhar Dhawan : మరోసారి వార్తల్లో నిలిచారు టీంఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. నెల క్రితం తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయిన ధావన్.. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. టీంఇండియాకి చెందిన ఓ మహిళా క్రికెటర్ తో ధావన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. ఆయేషా ముఖర్జీతో విడిపోవడానికి అదే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా శిఖర్ ధావన్‌... అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. శిఖర్ ధావన్ కంటే అయేషా ముఖర్జీ 12 ఏళ్ళు పెద్ద కావడం విశేషం.. ఫేస్ బుక్ లో హర్భజన్ సింగ్ వీరికి కామన్ ఫ్రెండ్... కాగా శిఖర్ ధావన్‌, అయేషా ముఖర్జీ దంపతులకి జోరావర్‌ అనే ఓ కొడుకు ఉన్నాడు. అటు అయేషా ముఖర్జీకి ఇది రెండో వివాహం... ఎనిమిదేళ్ల వివాహబంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

Next Story

RELATED STORIES