Badminton: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించిన భారత ప్లేయర్ సాత్విక్

Badminton: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్ సాధించిన భారత ప్లేయర్ సాత్విక్
భారత టాప్ సీడ్ క్రీడాకారులు పీవీ సింధు, ప్రనోయ్, కిదాంబి శ్రీకాంత్‌లు బుధవారం పోటీపడనున్నారు.

భారత బ్యాడ్మింటన్(Badminton) ఆటగాడు సాత్విక్ రంకిరెడ్డి(Satwik Rankireddy) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్(Guinness Book Of Records) రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో అత్యంత వేగవంతమైన స్మాష్ షాట్ కొట్టి తన పేరున రికార్డ్ లిఖించుకున్నాడు. గంటకు 565 కిలోమీటర్ల వేగంతో కళ్లు చెదిరే స్మాష్ కొట్టి, ఇంతకుముందు దశాబ్ధ కాలం క్రింద మలేషియన్ ఆటగాడు టాన్ బూన్ హ్యూంగ్ పేరిట ఉన్న గంటకు 493 కిలోమీటర్ల వేగవంతమైన స్మాష్ రికార్డును బద్ధలు కొట్టాడు. అతని కంటే ఇంకా 72 కిలోమీటర్ల వేగం తేడాతో రికార్డును మెరుగుపరిచాడు. అత్యంత వేగంగా వెళ్లే ఫార్ములా-1 రేస్ కారు ఇప్పటి దాకా 372.6 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోవడం గమనార్హం.

కొరియా ఓపెన్‌-2023 టోర్నీలో సాత్విక్ ఆడుతున్నాడు. మొదటి రోజు జరిగిన పోటీల్లో భారత్ నుంచి సాత్విక్, చిరాగ్‌లు మాత్రమే తదుపరి రౌండ్‌కి అర్హత సాధించారు. పురుషుల డబుల్స్‌లో గాయాల కారణంగా భారతత్ నుంచి ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్‌లు మ్యాచ్‌ను వదులుకున్నారు. శాశ్వత్ దలాల్, హర్షిత్ అగర్వాల్‌లు అర్హత పోటీలను దాటలేకపోయారు. భారత టాప్ సీడ్ క్రీడాకారులు పీవీ సింధు, ప్రనోయ్, కిదాంబి శ్రీకాంత్‌లు బుధవారం పోటీపడనున్నారు.



Tags

Read MoreRead Less
Next Story