Pakistan vs Srilanka: షకీల్ డబుల్ సెంచరీ, ఆధిక్యంలో పాక్

Pakistan vs Srilanka: షకీల్ డబుల్ సెంచరీ, ఆధిక్యంలో పాక్
శ్రీలంక మొదటి ఇన్సింగ్స్--> 312 ఆలౌట్, 2వ ఇన్నింగ్స్--> 14/0 (మధుష్క 8*, కరుణరత్రే 6*) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్--> 461 (షకీల్‌ 208*, సల్మాన్ 83, రమేష్ మెండిస్ 5-136) పాక్ ఆధిక్యం 135 పరుగులు

మొదటి టెస్ట్‌లో పట్టుబిగించే అవకాశాన్ని శ్రీలంక చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్(208 నాటౌట్, 4x19) అద్భుతమైన బ్యాటింగ్‌తో డబుల్‌ సెంచరీ చేయడంతో పాకిస్థాన్‌ 461 పరుగులు చేసి, 149 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తాను ఆడుతున్న 6వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ ఆఘా సల్మాన్(83) కూడా రాణించాడు. రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక వికెట్లు ఏమీ కోల్పోకుండా 14 పరుగులు చేసింది.


3వ రోజును 5 వికెట్లు కోల్పోయి 221తో ఇన్సింగ్స్ ప్రారంభించారు షకీల్, ఆఘా సల్మాన్‌(83, 113 బంతులు)లు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ 129 బంతుల్లో 100 పరుగులు చేశారు. రమేష్ మెండిస్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ 97 పరుగుల వద్ద ఉన్నపుడు క్యాచ్‌ డ్రాప్‌తో బతికిపోయాడు. 97 పరుగుల వద్ద మెండిస్‌ బౌలింగ్‌లో 3 పరుగులు పరుగెత్తి కెరీర్‌లో 2వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే ఓవర్లో చివరి బంతికి మరో బ్యాట్స్‌మెన్ ఆఘ క్రీజు ముందుకు వచ్చి ఆడబోయి, స్టంపౌంట్ అయి వెనుదిరిగాడు. వీరిద్దరూ 6వ వికెట్‌కి ఓవర్‌కి 5 పరుగుల రన్‌రేట్‌తో 177 పరుగులు చేశారు. పాకిస్థాన్ స్కోర్ 313/6 పరుగులు చేసి, 1 పరుగు ఆధిక్యంతో లంచ్‌కి వెళ్లింది.

లంచ్ తర్వాత నొమన్ అలీ 25 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షహీన్ ఆఫ్రిదీ కూడా ఎల్బీగా త్వరగానే పెవిలియన్ చేరాడు. అప్పటికి షకీల్ స్కోర్ 128 పరుగులు మాత్రమే. వికెట్లు పడుతున్నా షకీల్ ఒక్కడే పోరాడాడు. 139 పరుగుల వద్ద మరోసారి క్యాచ్ డ్రాప్‌ అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 222 బంతుల్లో 150 పరుగులు చేశాడు. టీ సమయానికి 389-8 పరుగులు చేసింది.


మరో ఎండ్‌లో ఉన్న పాక్ బౌలర్, బ్యాట్స్‌మెన్ నసీం షకీల్‌కి సహకారాన్నందించాడు. 440 పరుగుల వద్ద నసీం బౌల్డై వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లోనే ఫోర్ కొట్టి 200 పరుగుల మార్క్ దాటి, కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివరి వికెట్‌గా అహ్మద్‌ ఔట్ కావడంతో పాకిస్థాన్ పరుగుల ఆధిక్యంతో, 461 పరుగలకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో రజిత మెండిస్ 5 వికెట్లు తీశాడు.


Tags

Read MoreRead Less
Next Story