CWC2023: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం

CWC2023: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం
149 పరుగుల తేడాతో గెలిచిన ప్రొటీస్‌.. మహ్మదుల్లా ఒంటరి పోరాటం వృథా

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు... ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 46. 4 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో 149 పరుగుల తేడాతో సఫారీ జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మరోసారి భారీ శతకంతో మరోసారి చెలరేగాడు. 12 పరుగులు చేసిన హెన్డ్రిక్స్‌ను షోరిఫుల్ ఇస్లామ్‌ బౌల్డ్‌ చేయగా... ఒకే పరుగు చేసిన రస్సీ వాన్‌డెర్‌ డస్సెన్‌ను హసన్‌ మిరాజ్‌ వికెట్ల ముందు దొరకబు‌చ్చుకున్నాడు. దీంతో 8 ఓవర్లకో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.


ఈ ఆనందరం బంగ్లా బౌలర్లకు ఎక్కువసేపు నిలవలేదు. క్వింటన్‌ డికాక్‌...ఐడెన్‌ మార్క్రమ్‌ చెలరేగిపోయారు. ముఖ్యంగా క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌... బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులతో 90 పరుగులు చేశాడు.

డికాక్ కేవలం 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ఆరు ఓవర్లకు 33 పరుగులు చేసిన సమయంలో సఫారీకి తొలి దెబ్బ తగిలింది. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన డికాక్‌... క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు. డబుల్‌ సెంచరీ చేసేలా కనిపించిన డికాక్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు హసన్‌ మహముద్‌ తెర దించాడు. డికాక్‌ తర్వాత హెన్రిచ్‌ క్లాసెన్‌ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 49 బంతులే ఎదుర్కొన్న క్లాసెన్‌ 2 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. క్లాసెన్‌ అవుటైన తర్వాత విధ్వంసాన్ని కొనసాగించే పనిని మిల్లర్‌ తీసుకున్నాడు. 15 బంతుల్లోనే 1 ఫోరు, నాలుగు సిక్సులతో మిల్లర్‌ 34 పరుగులు చేశాడు. బ్యాటర్ల మెరుపులతో దక్షిణాఫ్రికా మరోసారి భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మహ్‌ముద్‌ రెండు, మిరాజ్‌, ఇస్లామ్‌, షకీబుల్‌ హసన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


అనంతరం 383 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ బ్యాటర్లను.. ప్రొటీస్‌ బౌలర్లు నిలబడనీయలేదు. ఆరంభంలో పర్వాలేదనిపించినా బంగ్లా బ్యాటర్లు.. తర్వాత పెవిలీయన్‌కు క్యూ కట్టారు. 30 పరుగుల వద్ద తన్జీద్‌ హసన్‌, శాంటోను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన జాన్సన్‌ బంగ్లా పతనాన్ని ప్రారంభించాడు. బంగ్లా 15 ఓవర్లలో 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నా మహ్మదుల్లా పోరాటం ఆపలేదు. ప్రొటీస్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న మహ్మదుల్లా 111 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సులతో 111 పరుగులు చేశాడు. ఈ శతకంతో 150 అయినా దాటదనుకున్న బంగ్లా స్కోరు 233కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story