Sunil Chhetri-Kohli: కోహ్లీతో నాకు ప్రత్యేక అనుబంధం: సునీల్ ఛెత్రీ

Sunil Chhetri-Kohli: కోహ్లీతో నాకు ప్రత్యేక అనుబంధం: సునీల్ ఛెత్రీ
ఇద్దరి మధ్యా జోకులేసుకునేంత ఫ్రెండ్ షిప్ ఉందంటోన్న ఫుట్ బాల్ క్రీడాకారుడు

18 సంవత్సరాలుగా ఫుట్‌బాల్‌ ఆడుతూ, భారత ఫుట్‌బాల్‌కు ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రీ(Sunil Chhetri), భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించాడు. తామిద్దరం కలిసి జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉంటామని వెల్లడించాడీ ఫుట్‌బాల్ కెప్టెన్‌.

ఇటీవలె భారత్‌ను ఇంటర్ కాంటినెంటల్ కప్, శాఫ్ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌లు గెలిపించంలో కీలకపాత్ర పోషించాడు. అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ఉబ్బితబబ్బిబవుతున్నాడు. అభిమానుల ఆదరాభిమానులే తనకు ప్రతీరోజు ప్రేరణిస్తాయని అంటున్నాడు.


విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహంపై స్పందిస్తూ ప్రేక్షకుల నుంచి అంచనాలు, ఒత్తిడిని ఎలా జయించాలన్న విషయాలపై కూలంకుషంగా చర్చిస్తామన్నాడు.మేం చాలా సాధారణ విషయాలు మాట్లాడుకుంటూ, జోక్స్ షేర్ చేసుకుంటూ నవ్వుల్లో మునిగి తేలుతామన్నాడు. మేము ప్రతీరోజూ ఏం మాట్లాడుకోం. మాట్లాడినప్పుడు మాత్రం అర్థవంతమైన, అవసరమయ్యే చర్చలు ఉంటాయన్నాడు. నెలలపాటు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూగా ఉన్నాయన్నాడు. మళ్లీ ఎక్కడ ముగించామో అక్కడి నుంచి చర్చ ప్రారంభిస్తామన్నాడు. ఎవరూ అర్థం చేసుకోలేని విషయాల్ని కోహ్లీ అర్థం చేసుకుంటాడు.


తమ తమ ఆటల్లో వీరిద్దరూ కూడా తమ స్థిరమైన ఆట, ఫర్మార్మెన్స్‌లతో అత్యుత్తమైన ఫిట్‌నెట్‌ ప్రమాణాలను నెలకొల్పారు. 2 దశబ్ధాల తన కెరీర్లో 92 అంతర్జాతీయ గోల్స్‌ కొట్టి ఫుట్‌బాల్ మేటి ఆటగాళ్లు రొనాల్డో, మెస్సీల తరావాత నిలిచాడు. దేశంలో పలు ఫుట్‌బాల్ క్లబ్‌ల తరపున ఆడుతూ ఎన్నో టైటిళ్లు సాధించిపెట్టాడు.

ఛెత్రీ(Sunil Chhetri) ఫుట్‌బాల్‌ క్రీడలో తనకు దక్కుతున్న గౌరవం, ఈ ఆటలో పొందుతున్న సంతోషాలకి కృతజ్ణతలు తెలిపాడు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇన్ని సంవత్సరాలు ఆడడం, ఎన్నో పురస్కారాలు పొందడం, ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం వంటి వాటిని తాను గౌరవంగా భావిస్తున్నానన్నాడు. నా జీవితంలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. సునీల్ ఛెత్రీ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనే విషయం నాకు కలలా అన్పిస్తోందన్నాడు.

ప్రముఖ వ్యక్తులను కలిసినప్పుడు తనకు ఉండే బెరుకు గురించి వెల్లడించాడు.


నేను మేరీకోమ్‌ని కలిస్తే తనకు ఒక అభిమాని కలిశాడని తెలుస్తుంది. అలాగే నీరజ్ చోప్రా కూడా. సినిమా స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ని కలిసినపుడు నా శక్తినంతా కూడగుట్టకుని నేను మీకు పెద్ద ఫ్యాన్‌ అని చెప్పాను. ఒక ఫుట్‌బాల్ టోర్నీకి ముఖ్యఅతిథులుగా వెళ్లాం. మొదటిసారి సచిన్ టెండూల్కర్‌ని కలిసినపుడు నాకు భయమేసింది. నాకు అతను ఎంత ప్రేరణ ఇస్తాడో, ప్రజలు అతన్ని ఎంతలా అభిమానిస్తారో చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు అని వెల్లడించాడు.


Tags

Read MoreRead Less
Next Story