పాక్-ఆఫ్గన్ క్రికెట్ సిరీస్.. ఓకే చెప్పిన తాలిబన్లు..!

Afghanistan Vs Pakistan: ఆఫ్గనిస్తాన్‌‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి.

పాక్-ఆఫ్గన్ క్రికెట్ సిరీస్.. ఓకే చెప్పిన తాలిబన్లు..!
X

Afghanistan Vs Pakistan: ఆఫ్గనిస్తాన్‌‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. దాంతో ఆదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. పాకిస్థాన్- ఆఫ్గనిస్థాన్ మధ్య శ్రీలంక వేదికగా క్రికెట్ టోర్నీ వచ్చే నెలలో జరగాల్సివుంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్ వ్యతిరేకించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సిరీస్‌ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) పేర్కొనడం సంచలనంగా మారింది.

అయితే తొలుత పాక్-ఆఫ్గన్ సిరీస్‌ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లబించింది. దాంతో క్రీడా ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్‌, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సివుంది. ఆఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లతో కీలక ఆటగాళ్లు 100సిరీస్ లో బీజీగా ఉన్నారు. రషీద్ ఖాన్, నబి వంటి ఆటగాళ్లు ప్రస్తుతం ఇతర దేశంలో ఉన్నారు.

Next Story

RELATED STORIES