క్రీడలు

IND Vs SL: భువీ ఖాతాలో మరో రికార్డు.. 6 ఏళ్ల తర్వాత మళ్లీ..

IND Vs SL: మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ నేపథ్యంలో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ క్రమంలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది.

Bhuvneshwar Kumar No ball
X

Bhuvneshwar Kumar

IND Vs SL: మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ నేపథ్యంలో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ క్రమంలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం(జులై 20) రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా సీనియర్ పేసర్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ అరుదైన ఘనత సాధించాడు. రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో నోబాల్ వేసిన భువీ.. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ నోబాల్ వేసిన ఆటగాడిగా నిలిచాడు. భువీ తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం మరో విశేషం.

2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన అతను.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్‌ వేశాడు. 8 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తక్కువ నోబాల్స్‌ వేసిన బౌలర్‌ కేవలం భువీ మాత్రమే అయ్యిండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వర్ నోబాల్ వేసిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతర్జాతీయ కెరీర్‌లో 21 టెస్ట్‌లు, 120 వన్డేలు, 48 టీ20లు భువీ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 247 వికెట్లు పడగొట్టాడు.Next Story

RELATED STORIES