RAHUL DRAVID: అవును బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమస్య ఉంది

RAHUL DRAVID: అవును బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమస్య ఉంది
టీ ట్వీంటీ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో సమస్య ఉందన్న రాహుల్‌... కసరత్తు ప్రారంభించామని వెల్లడి

టీ ట్వంటీ క్రికెట్‌ భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సమస్య కనిపించిందని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడంపై సర్వత్రా విమర్శలు కురుస్తున్నాయి. ఐదో టీ20 మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ద్రవిడ్(Head coach Rahul Dravid)... భారత( Team India ) బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా తాము గమనించిన ప్రధాన అంశం బ్యాటింగ్‌ లైనప్‌ అని... కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాహుల్‌ ఒప్పుకున్నాడు. ఈసిరీస్‌ ద్వారా మేం ఎక్కడ మెరుగు కావాలనేది తెలుసుకోగలిగామన్న ద్రవిడ్‌.. బ్యాటింగ్‌ డెప్త్‌ విషయంలో మరిన్ని ప్రయత్నాలు చేయాలి ఉందన్నాడు.


తమ బౌలింగ్‌ మరీ బలహీనంగా లేదని.. భవిష్యత్తులోనూ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయన్నారు. లోతైన బ్యాటింగ్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన రాహుల్‌ ద్రవిడ్‌... వెస్టిండీస్‌ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా భారీ షాట్లు ఆడతాడని కానీ మన దగ్గర ఆ లోటు(batting depth) ఉందన్నారు. అందుకే బ్యాటింగ్‌ విషయంలో మనకు సవాళ్లు ఎదురయ్యాయని, వాటిపై తప్పకుండా కసరత్తు చేస్తామని రాహుల్‌ అన్నాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో విండీస్‌ విజయం సాధించగా.. ఆ తర్వాత రెండింట్లో భారత్ గెలిచింది. దీంతో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌ కీలకంగా మారింది. అయితే భారత్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో గొప్పగా రాణించలేకపోవడంతో విండీస్‌ అలవోకగా విజయం సాధించి సిరీస్‌( India lost 2-3 )ను కైవసం చేసుకుంది. విండీస్‌ పర్యటనను భారత్‌ ఓటమితో ముగించాల్సి వచ్చింది. ఆగస్ట్ 18 నుంచి బుమ్రా నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story