క్రీడలు

Varun Chakravarthy : టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌..!

Varun Chakravarthy : దీనితో అతడు ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Varun Chakravarthy : టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌..!
X

Varun Chakravarthy : వరల్డ్ కప్ ముందు టీంఇండియాకి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. IPL లో కోల్ కత్తా జట్టు తరుపున ఆడుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మోకాలి నొప్పులతో అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పెయిన్‌ కిల్లర్‌ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీనితో అతడు ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్‌ స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అటు ఇప్పటివరకు టీంఇండియా తరుపున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు వరుణ్.

Next Story

RELATED STORIES