Vivo IPL 2021: ఆర్‌సీబీ క్యాప్టెన్‌గా విరాట్ చివరి మ్యాచ్.. హర్షల్ పటేల్ గుర్తుండిపోయే గిఫ్ట్..

Vivo IPL 2021: ఆర్‌సీబీ క్యాప్టెన్‌గా విరాట్ చివరి మ్యాచ్.. హర్షల్ పటేల్ గుర్తుండిపోయే గిఫ్ట్..
Vivo IPL 2021: ఇంతకు ముందు జరిగిన ఐపీఎల్ సీజన్స్ కంటే ఈ ఐపీఎల్ సీజన్ చాలా ఢిఫరెంట్‌గా కనిపిస్తోంది.

Vivo IPL 2021: ఇంతకు ముందు జరిగిన ఐపీఎల్ సీజన్స్ కంటే ఈ ఐపీఎల్ సీజన్ చాలా ఢిఫరెంట్‌గా కనిపిస్తోంది. కరోనా వల్ల పలుమార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఇన్నాళ్లకు ఐపీఎల్ మళ్లీ ఫైనల్స్ వరకు రాగలిగింది. ఆట గెలిచిన గెలవకపోయినా పలు టీమ్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. నిన్న(సోమవారం) కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ తన ఆటతో లేటెస్ట్ రికార్డును సృష్టించాడు.

ఒక్క ఐపీఎల్ సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ ఘనత సాధించాడు. ఇప్పటివరకు అన్ని ఐపీఎల్ సీజన్స్‌లో కలిపి 15 మ్యాచ్‌లు ఆడాడు హర్షల్ పటేల్. ఈ 15 మ్యాచ్‌లలో మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఈ రికార్డును హర్షల్ పటేల్.. సీఎస్‌కే ప్లేయర్ డ్వేన్ బ్రావోతో తన రికార్డును షేర్ చేసుకుంటున్నాడు.

2013లో డ్వేన్ బ్రావో కూడా 32 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇన్నాళ్ల తర్వాత హర్షల్ పటేల్ తన రికార్డును అందుకున్నాడు. ఒక్క క్యాప్ కూడా సాధించకుండా హర్షల్ పటేల్ ఈ మార్క్‌ను రీచ్ అవ్వడం విశేషం. కాగా ఆర్‌సీబీకి క్యాప్టన్‌గా విరాట్ ఇటీవల తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఇకపై ఆర్‌సీబీ క్యాప్టన్‌లాగా కాకుండా కేవలం ప్లేయిర్‌లాగా కొనసాగుతానని విరాట్ అన్నాడు. అయితే క్యాప్టన్‌గా తాను ఆడిన చివరి ఆట వారికి పరాజయాన్నే మిగిల్చింది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story